TPCC: పార్టీని గాడిలో పెడుతా.. RTVతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని, తనకున్న అనుభవంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతానని టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 15న టీపీసీసీ చీఫ్‌గా అధికారంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన RTVతో మాట్లాడారు.

author-image
By srinivas
New Update
tgs

TPCC Mahesh Kumar : కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని, తనకున్న అనుభవంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతానని టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు బుధవారం RTVతో మాట్లాడిన మహేష్ కుమార్.. పార్టీ నాయకులందరి గురుంచి తనకు బాగా తెలుసు అన్నారు. సెప్టెంబర్ 15న టీపీసీసీ చీఫ్‌గా అధికారంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన.. సెప్టెంబర్ 17ను గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినట్టుగానే ఈసారి కూడా నిర్వహిస్తామన్నారు.

ఎలా నిర్వహిస్తుందో ఇంకా నిర్ణయించలేదు..

'ప్రస్తుతానికి సెప్టెంబర్ 17న సెప్టెంబర్ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో ఇంకా నిర్ణయించలేదు. ఈసారి పార్టీలో పదవుల సంఖ్య తక్కువ ఉంటుంది. పార్టీ కమిటీలను కుదిస్తాం. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికి సముచిత పదవులు దక్కాయి. ఇంకా అవకాశాలు ఉన్నాయి. బీసీలకు ప్రభుత్వ అంశాలను పార్టీ ద్వారా ప్రజలకు వివరిస్తాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక పార్టీ పదవులు ఎక్కువగా ఉండే. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి పార్టీలో ఎక్కువ పదవులు ఉండవు. తక్కువ సంఖ్యలోనే పీసీసీ కార్యవర్గం ఉంటుంది' అని మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

Also Read :  ఆడపిల్లను కిడ్నాప్‌ చేశారంటూ బెదిరింపు కాల్స్‌..జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు