జిల్లాలో పెద్దపులి మరోసారి రెచ్చిపోయింది. తాజాగా మరొకరిపై దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి దిగింది. పొలానికి వెళ్లిన రైతు సురేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉండే రైతులు గట్టిగా అరిచారు. ఇది కూడా చదవండి: అర్థంతారంగా రాలిన తార.. సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ ఆ కేకలు విన్న పులి అక్కడ నుంచి పారిపోయింది. పులి దాడిలో సురేష్ మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే రైతులు అక్కడకి చేరుకుని గాయపడిన సురేష్ ను హుటా హుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే ఓ మహిళపై దాడి చేసి చంపిన 24 గంటల్లోనే మరో వ్యక్తిపై దాడి చేయడంతో జిల్లా వాసులు పులి భయంతో గజగజ వణికిపోతున్నారు. 144 సెక్షన్ అమలు కాగా పులి జాడ కోసం కాగజ్ నగర్ అడవుల్లో అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు పేర్కొన్నారు. డ్రోన్, ట్రాప్ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. మరోవైపు పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ ఇదిలా ఉంటే పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఈజ్గాంలో లక్ష్మి అనే యువతి పత్తి ఏరేందుకు వెళ్లగా అక్కడ పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా గన్నారం మండల వాసి అయిన లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సురేఖ.. యువతి మరణించడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని చెప్పారు. అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని తెలిపారు. Also Read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే! Also Read: కాశీ ఆలయంలో కేక్ కట్ చేసిన మోడల్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు