Telangana: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

New Update
hyd

Telangana: రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains)  కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, జనగాం, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌(Mahabub Nagar) , నాగర్‌ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 

Also Read:ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం

ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి(Wanaparthy), నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ (Yellow Alert) ను జారీ చేశారు. రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది.

Also Read: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే!

ఆఫీసులకు(Office) వెళ్లే సమయంలో వాన కురవడంతో అటు వాహనదారులు, ఇటు బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మేడ్చల్(Medchal) , కిష్టాపూర్, కండ్లకోయ, దుండిగల్‌, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ,  తదితర చోట్ల భారీ వర్షం పడింది. 

Also Read: తిరుమల ప్రసాదంలో జెర్రీ!

ఐఎండీ (IMD) ఎప్పటికప్పుడు వర్షాలపై అలర్ట్​ చేస్తున్నా, హైదరాబాద్​​ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఏ క్షణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులు కమ్ముతూ, అకస్మాత్తుగా వర్షం కుండపోతగా కురుస్తుంది. ఏదేమైనా బయటకి వెళ్లే వారు కాస్త అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ, ఇటు జీహెచ్​ఎంసీ (GHMC) ప్రజలకు సూచిస్తున్నారు.

Also Read: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం

Advertisment
Advertisment
తాజా కథనాలు