MLA Raja Singh : ఇదే నీకు ఆఖరి శ్రీరామనవమి...ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇతర వర్గాలనుంచి తరచుగా బెదిరింపులు వస్తూనే ఉంటాయి. తాజాగా 27న జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయనను చంపేస్తామంటూ మరోసారి లేఖ రావడం కలకలం సృష్టించింది. ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి అంటూ అగంతకులు ఆ లేఖలో రాజాసింగ్ ను హెచ్చరించారు.

New Update
FotoJet (13)

Threatening letter to MLA Raja Singh

MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చుట్టూ ఎపుడూ సంచలనాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆయన మాటలు కూడా ఎదుటివారికి సూటిగా తగులుతాయి. ఫక్కా హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయనకు ఇతర వర్గాలనుంచి తరచుగా బెదిరింపులు వస్తూనే ఉంటాయి. తాజాగా 27న జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయనను చంపేస్తామంటూ మరోసారి లేఖ రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు మరోసారి బెదిరింపులుఎదురయ్యాయి. ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి అంటూ అగంతకులు ఆ లేఖలో రాజాసింగ్ ను హెచ్చరించారు.

శ్రీరామ నవమి యాత్రలోనే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ అగంతకులు లేఖ పంపారు.నిన్ను అంతమొందించేందుకు మూడు టీమ్ లను రంగంలోకి దించామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరో రెండు చోట్ల బాంబ్ బ్లాస్టింగ్ కు ప్లాన్‌  చేశామని కూడా  ఆ లేఖలో హెచ్చరించారు. పురానాపూల్ నుంచి బేగం బజార్ వరకు చంపేందుకు స్కెచ్ వేశామని వెల్లడి. స్నైపర్‌ గన్‌తో తల పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.నిన్ను చంపేవాడిని నేనే అంటూ లెటర్ రాసినట్లు రాజాసింగ్‌ ఇటీవల ఒక సమావేశంలో వెల్లడించారు.  తాను శ్రీరామనవమి ఉత్సవ సన్నాహాల్లో బిజీగా ఉన్నానన, ఈ సమయంలో తనకు వచ్చిన లేఖను తెరిచి చూస్తే అందులో బెదిరింపులు ఉన్నాయని ఆయన తన సన్నిహితులకు తెలుపుతున్న వీడియో సంచలనంగా మారింది.   

కాగా తనకు వచ్చిన బెదిరింపు లేఖ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని కానీ, వారు ఆ లేఖను తేలిగ్గా తీసుకున్నారన్నారు. ఇలాంటివి సర్వసాధారణమే అని, మీకు ఏం కాదంటూ వారు చెప్పారని రాజాసింగ్‌ వివరించారు. రాజాసింగ్ ఖతమైతే మేం టెన్షన్ ఫ్రీగా ఉండవచ్చని పోలీసులు కూడా  భావిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  చావు ఏదో ఒక రోజు తప్పదని, నేను వెళ్లిపోతే నా తర్వాతా మీరంతా హిందూ ధర్మ పరిరక్షణకు పోరాడాలని తన కార్యకర్తలకు రాజాసింగ్ పిలుపునిచ్చిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు