/rtv/media/media_files/2025/03/16/aiWEspskncyHbgpfFuRd.jpg)
The village is empty
Karimnagar : ఆధునికత ఎంతపెరిగినా..ప్రపంచం రాకెట్ యుగంలోకి ప్రవేశించినా ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అలాంటిదే కరీంనగర్ జిల్లాలోనూ చోటు చేసుకుంది. జిల్లాలోని ఒక ఊరిలో వరుస మరణాలతో గ్రామస్తుల్లో భయం పట్టుకుంది. ఊరికి కీడు జరిగిందంటూ ఊరు వాళ్లంతా ఊరిని విడిచిపెట్టి ఓ రోజంతా ఊరి భయటే గడిపారు. వివరాల్లోకి వెళితే...
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఒకరు మృతి చెందిన తర్వాత వారి దిశదినకర్మలు పూర్తి కాకుండానే మరోకరు చనిపోతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది తనువు చాలించారు. దీంతో గ్రామస్తుల్లో భయం నెలకొంది. తరువాతి వంతు ఎవరిదో అన్న సందిగ్ధం నెలకొంది. గ్రామస్తులంతా సమావేశమై తమ గ్రామానికి కీడు సోకిందని నిర్ధారించారు
గ్రామానికి పట్టిన కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి పెట్టి వెళ్లిపోవాలని గ్రామ పెద్ధల తీర్మానించారు.
Also Read : Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ
ఊరివాళ్లంతా ఊరి బయటకు వెళ్లి కీడు వంటలు వండుకోవాలని పెద్ద మనుసులు తేల్చారు. దీంతో.. గ్రామస్తులు.. ఒక్కరోజంతా గ్రామం వదిలి పెట్టి వెళ్లాలని నిర్ణయింకున్నారు. ఇంకేముంది అందరూ ఉదయం 6 గంటలకే లేచి..ఇళ్లకు తాళాలు వేసి..పొలం బాట పట్టారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరు మానేరు తీర ప్రాంతంలో కీడు వంటలకు వెళ్లారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని తిన్నారు. ఎవరు కూడా మధ్యలో మళ్ళీ గ్రామంలోకి వెళ్ళవద్దని నిర్ణయం తీసుకున్నారు..
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
ఆ రోజంతా కుటుంబ సభ్యులు మొత్తం.. పొలాల వద్దనే గడిపారు. కీడు సోకడం వల్ల గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని.. కీడు పోవాలంటే గ్రామాన్ని విడిచి కీడు వంటలు చేసినట్లయితే ఆ పీడ పోతుందని పెద్దలు తెలపడంతో గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వచ్చామని గ్రామస్తులు చెబుతున్నారు.. గతంలో ఇదే మాదిరిగా గ్రామానికి కీడు సోకితే కీడు వంటలకు వచ్చామని అప్పుడు బాగానే జరిగిందని వివరించారు. అయితే..ఇలాంటి మూడ నమ్మకాలను నమ్మవద్దని హేతువాదులు చెబుతున్నారు. ఇవన్నీ సహజ మరణాలు అని..ఎలాంటి ఆందోళన చెందల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వం..ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి..వారికి వాస్తవాలు వివరించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా గ్రామస్తులు అందరూ తెల్లవారుజామునే ఊరు విడిచి వెళ్లడంతో విలాసాగర్ గ్రామం అంతా నిర్మానుషంగా మారింది. ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?