MP Mallu Ravi : ఆ పాప జాతరలో చనిపోలేదు..కాంగ్రెస్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణలో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న జాతరలో ఘర్షణ జరిగింది వాస్తవం.. కానీ ఆ పాప మృతికి ఘర్షణ కారణం కాదన్నారు.

New Update
FotoJet (19)

MP Mallu Ravi

MP Mallu Ravi : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో అగ్రకులాల వారికి బీసీ కుటుంబానికి జరిగిన ఘర్షణలో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. బీసీ కుల సంఘాల ఆందోళనలతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మల్లన్న జాతరలో ఘర్షణ జరిగింది వాస్తవం.. కానీ ఆ పాప మృతికి ఘర్షణ కారణం కాదన్నారు.. ఫిబ్రవరి 18న ఘర్షణ జరిగితే.. 21న ఆ పాప మృతి చెందిందని ఎంపీ అన్నారు. ఆ పాప మృతి అత్యంత బాధాకరం.. కానీ మరణానికి అక్కడ ఘర్షణ కారణం కాదని ఎంపీ వివరించారు. కొబ్బరి కాయలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే అంశంలో గొడవ జరిగిందన్నారు. పాప తండ్రి గణేష్ తాను ఎక్కువ ధరలకు కొననని గొడవకు దిగడంతో ఘర్షణ జరిగిందని వెల్లడించారు. అక్కడ గణేష్‌కు, శ్రీనివాస్ రెడ్డి‌కి మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇక్కడ జరిగిన గొడవలతో పోలీసులకు రెండు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారని మల్లు రవి వివరించారు.

ఇక పాప మరణం గురించి వివరిస్తూ.. గణేష్ కూతురు నెలలు నిండక ముందే పుట్టిందన్నారు. ఆమె లంగ్స్ సమస్యలతో బాధ పడుతోందన్నారు. ఆ కారణంగానే ఆ పాప మరణించిందని తెలిపారు. పాప మరణానికి జాతరలో జరిగిన ఘర్షణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘర్షణ జరిగిన మూడు రోజుల తర్వాత గణేష్ వాళ్ళు పాపను ఘర్షణలో చంపేసారని తప్పుడు ఫిర్యాదు చేశారని ఎంపీ ఆరోపించారు. అంతే కాకుండా ఆ పాప తల్లి ఎస్సీ కాదని.. అయినా కూడా వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి వారి రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు అర్దం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉందని ఎప్పుడూ ఎవరికీ కాంగ్రెస్ అన్యాయం చేయదన్నారు. చిన్న పాప మరణాన్ని రాజకీయం చేయొద్దు’ అని మల్లు రవి కోరారు.

Advertisment
తాజా కథనాలు