TGRTC: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..! తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవల్ని దసరా నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. By Bhavana 02 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి TGRTC: తెలంగాణ(Telangana) ఆర్టీసీ (RTC) ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే అనేక కొత్త సేవలు ప్రారంభించింది. తాజాగా.. ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవల్ని దసరా నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేయనున్నారు. Also Read: చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ద్వారా డెలివరీ చేస్తారు. ముందుగా దీన్ని హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ దశలవారీగా అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఇంటింటికి వెళ్లి పార్శిల్ తీసుకొని డెలివరీ చేయటం ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ సేవల పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఇరాన్ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది! నేడు కొత్త బస్సులు ప్రారంభం.. తెలంగాణలో నేడు నూతనంగా ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ (RTC Electric Super Luxury) బస్సులను నడపనుంది.నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్-2, కరీంనగర్ -2, వరంగల్, నిజామాబాద్, డిపోల నుంచి బస్సులు నడపనుంది. ముందుగా నేడు కరీంనగర్-2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టేందుకు సిద్దమవనున్నాయి. వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ MD సజ్జనార్ ప్రారంభిస్తారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబీఎస్, మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. Also Read: ఇజ్రాయెల్ మీద క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి