/rtv/media/media_files/2026/06/01/tspsc-2026-06-01-17-07-14.jpg)
తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు కానుక ఇస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది.
అర్హులైన అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు క్రింది తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్: జూన్ 6 నుంచి జూలై 13 వరకు.
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్: జూన్ 8 నుంచి జూలై 15 వరకు.
- అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (PCB): జూన్ 10 నుంచి జూలై 17 వరకు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, సిలబస్, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి ఎం.హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
Follow Us