హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీజీఎస్ రోడ్డు రవాణా సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జులై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండటం విశేషం.
Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం రద్దీ సమయాల్లో సిటీ బస్సులు అధిక లోడ్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు.
Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.వీరిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు నగరంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో టీఎస్‌ఆర్టీసీ ముందుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం 3,100 బస్సులు నడుస్తుండగా.. రానున్న రోజుల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది. 2025 డిసెంబర్ నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ చర్యలు నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు.
Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్..10 మంది సైనికులు హతం!
Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
rtc | electric-bus | Electric busses in telangana | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates