Konda Surekha: ఇలా ట్రోల్ చేస్తారా.. కొండా సురేఖ కన్నీళ్లు-VIDEO

మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తాను అన్నం తినలేదని.. నిద్ర కూడా పోలేదన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఇలా ట్రోల్ చేస్తారా? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

New Update

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై ఇష్టారీతిగా పోస్టులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన సురేఖ..ఇటీవల దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు సురేఖకు చేనేతతో తయారు చేసిన దండను అందించారు. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని కోరారు. ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ మహిళా నేత కవితపై కూడా ఇలానే ట్రోల్ చేస్తే ఊరుకుంటారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 

తెలంగాణ భవన్ వద్ద ఆందోళన..

కొండా సురేఖను ట్రోల్ చేయడంపై పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు