Telangana Temperatures : భగ్గుమంటున్న భానుడు..పిట్టల్లా రాలుతున్న జనాలు

తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో అతలాకుతలం చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాలులతో జనం విలవిల్లాడుతున్నారు. వడ దెబ్బతో రాష్ట్రంలో ఒక్కరోజే 51 మంది మరణించారు.

New Update
FotoJet - 2026-05-24T101845.687

Temperatures soar in Telangana

Telangana Temperatures : తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో అతలాకుతలం చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రాణనష్టం భారీగా నమోదైంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో వడదెబ్బకు గురై 51 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మృతుల్లో అత్యధికంగా వృద్ధులు, ఆరుగాలం కష్టపడే కూలీలు, రైతులు ఉన్నారు.

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు: జిల్లాల వారీగా వివరాలు

పలు జిల్లాల్లో ఎండల తీవ్రత 46 డిగ్రీల మార్కును దాటిపోయింది. అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతల పట్టిక:

జిల్లా / ప్రాంతం                                                          నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత

కుంచవెళ్లి, కాగజ్‌నగర్ (ఆసిఫాబాద్‌ జిల్లా)                          46.4°C

ధర్మపురి (జగిత్యాల జిల్లా) / మణుగూరు (కొత్తగూడెం)           46.3°C

ఖమ్మం రూరల్‌, వైరా / తాండూర్‌ (మంచిర్యాల)                  46.1°C

గ్రేటర్ హైదరాబాద్ (పలు ప్రాంతాలు)                                  42.0°C+

వడదెబ్బ మరణాలతో రాష్ట్రం విలవిలలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వడదెబ్బతో 51 మంది మరణించారు. వారిలో  ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఎక్కువగా ఉంంద

ఉమ్మడి వరంగల్‌ జిల్లా: 23 మంది

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: 11 మంది

ఉమ్మడి ఖమ్మం జిల్లా: 07 మంది

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: 05 మంది

ఉమ్మడి నల్గొండ జిల్లా: 05 మంది (వీరిలో ఒకరు కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చి వడదెబ్బకు గురై మరణించారు).

మృతుల వివరాలు (జిల్లాల వారీగా):

ఉమ్మడి కరీంనగర్/పెద్దపల్లి/సిరిసిల్ల: ఫయాజ్ (52), కోరె మల్లయ్య (65), న్యాతరి మొండయ్య (76), బుడిగే కమల (65), వెలదాడి మహేశ్ (51), ఎం. శంకర్ (45), జగనవేణి మల్లమ్మ (56-ఒప్పంద కార్మికురాలు), కనుకుంట్ల ఐలమ్మ (73), దామెరశెట్టి మల్లేశం (52), మంచాల నర్సయ్య (75), ఎం. శంకర్ (48).

ఉమ్మడి ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం: జెట్టి పూలమ్మ (65), పి. వెంకటేశ్వరరావు (38), దారావత్ నరసింహారావు (45), నరేశ్ (33), చల్ల లచ్చమ్మ (87), ఆర్‌. వెంకటరమణ (65), మల్లారపు వెంకటేశ్వర్లు (45).

ఉమ్మడి వరంగల్ : చిలువేరు సారమ్మ (85), శెంకేశి భాగ్యలక్ష్మి (55), సింగారపు కుమారస్వామి (45), దొడ్డ సత్యనారాయణ (56), బానోతు కమ్లీ (65), మూడు జాన్వు (38), రొయ్యల పెద్దరాములు (75), షేక్ జాన్మియా (42), వీరమల్లు (70), ఊటుకూరి సోమిరెడ్డి (78-రైతు), జ్యోతి (70), డి. మాన్‌సింగ్ (74), మనుపాటి ఎల్లయ్య (63), వెల్దండి వెంకటేశ్వర్లు (50), పోడేటి లచ్చమ్మ (82), దుగ్యాల ప్రమీల (70), దుగ్యాని కొమురయ్య (101), చిన్న మల్లయ్య (90), శాంతమ్మ (90), నీలమ్మ (80).

భూపాలపల్లి/నిర్మల్/ఆదిలాబాద్/మంచిర్యాల: దుర్గం అంకయ్య (65), భూయాన్ వినోద్ (35-ఝార్ఖండ్ వలస కూలీ), గుర్తుతెలియని భక్తుడు (45-పుష్కరాలు), ఎనుపోతుల బాబు (55), సట్వే శంకర్ (50), గుర్తుతెలియని వృద్ధురాలు (70), బిలాల్ పారిక్ (40), రామగిరి పుల్లమ్మ (78).

ఉమ్మడి నల్గొండ/సూర్యాపేట/యాదాద్రి: చౌగోని దుర్గాప్రసాద్ (30), చెన్న హరికిషన్ (50), వరికుప్పల శంకరయ్య (65), దేవరకొండ శంకరయ్య (65), షేక్ ఇస్మాయిల్ (38).

రాజధానిలో రికార్డు విద్యుత్ వినియోగం

ఎండల తీవ్రత పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏసీలు, కూలర్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో 4,782 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. అలాగే రోజువారీ విద్యుత్తు వినియోగం 101.07 మిలియన్‌ యూనిట్లకు చేరడం గమనార్హం.

మూగజీవాల హాహాకారాలు.. వందలాది గబ్బిలాలు మృతి
తీవ్రమైన వడగాడ్పుల ప్రభావం మనుషులపైనే కాకుండా మూగజీవాలపై కూడా పడింది. మహబూబాబాద్‌లోని నీటి పారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న భారీ చింత చెట్టుపై నివసించే వందలాది గబ్బిలాలు ఎండ వేడిని తట్టుకోలేక ఒక్కసారిగా విలవిల్లాడుతూ కిందపడి మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న మునిసిపల్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ఆ మూగజీవాల కళేబరాలను జేసీబీ సాయంతో గోతిని తీసి ఖననం చేశారు.

అప్రమత్తమైన విద్యుత్ శాఖ: ట్రాన్స్‌ఫార్మర్లకు 'కూలింగ్' చికిత్స

ఎండల దెబ్బకు సబ్‌స్టేషన్లలోని భారీ ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి పేలిపోకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. హనుమకొండ బాలసముద్రంలోని సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అవ్వకుండా ఉండేందుకు, వాటిపై విద్యుత్తు సిబ్బంది గోనె సంచి పట్టాలను కప్పి నిరంతరం నీళ్లు చల్లుతూ చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ హెచ్చరిక: రాబోయే రెండు రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగినన్ని నీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని వాతావరణ శాఖ మరియు ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు