| 🛑LIVE BREAKINGS: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! By Manoj Varma 30 Nov 2024 | నవీకరించబడింది పై 04 Dec 2024 21:53 IST in Latest News In Telugu New Update షేర్ చేయండి Dec 04, 2024 21:53 IST ట్రాఫిక్‌వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. ఈవెంట్స్‌లో 44 మంది క్వాలిఫై బుధవారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాన్స్‌జెండర్లకు రన్నింగ్, జంపింగ్‌లతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఇందులో 58 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొనగా.. 44 మంది క్వాలిఫై అయ్యారు. https://rtvlive.com/telangana/44-transgenders-qualified-in-events-for-trafiic-volunteers-in-hyderabad-7775637 Dec 04, 2024 21:23 IST BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్! నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్ షోకు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. https://rtvlive.com/cinema/police-lathicharge-at-sandhya-theatre-in-hyderabad-ahead-of-pushpa-2-premier-show-7775576 Dec 04, 2024 20:54 IST ఆ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు: భట్టి విక్రమార్క రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మాలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. https://rtvlive.com/telangana/deputy-cm-batti-vikramarka-key-comments-in-peddapelly-sabha-7775474 Dec 04, 2024 20:27 IST పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. ఇంతకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. https://rtvlive.com/national/if-men-had-menstruation-theyll-know-supreme-court-questions-madya-pradesh-high-court-7775393 Dec 04, 2024 19:03 IST పెద్దపల్లికి వరాల జల్లులు కురిపించిన సీఎం రేవంత్.. పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సైతం మంజూరు చేశారు. https://rtvlive.com/telangana/cm-revanth-inaugurated-development-works-in-peddapally-7773366 Dec 04, 2024 18:58 IST ‘పుష్ప2’ రిలీజ్ వేళ.. నాగబాబు ఆసక్తికర ట్వీట్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాపై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిసినిమా విజయం సాధించాలని..ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రియులు సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. https://rtvlive.com/cinema/nagababu-interesting-tweet-on-pushpa-2-movie-7769387 Dec 04, 2024 17:58 IST పిఠాపురంలో హైటెన్షన్.. పుష్ప2 ఫ్లెక్సీల చించివేత.! పిఠాపురంలో 'పుష్ప2' ఫ్లెక్సీల చింపివేత కలకలం రేపింది. ఫ్లెక్సీల చించివేతపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే మెగా ఫ్యాన్స్ 'పుష్ప2' ఫ్లెక్సీలు, పోస్టర్లు చించివేశారని బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. https://rtvlive.com/cinema/pithapuram-high-tension-pushpa-2-flexis-allu-arjun-fans-vs-mega-fans-telugu-news-7760455 Dec 04, 2024 17:49 IST ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్ ప్రారంభం: పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా మొబైల్ యాప్ రూపొందించామని మంత్రి పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం సీఎం రేవంత్ దీన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. https://rtvlive.com/telangana/minister-ponguleti-srinivas-reddy-key-comments-on-indiramma-houses-scheme-7760495 Dec 04, 2024 17:25 IST రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు. https://rtvlive.com/national/railways-gives-56993-crores-subsidy-on-tickets-every-year-says-ashwini-vaishnaw-7760351 Dec 04, 2024 17:24 IST సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా సారా బాధ్యతలు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఇటీవలే క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసిన సారా సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు. https://rtvlive.com/cinema/sara-tendulkar-has-taken-sachin-tendulkar-foundation-responsibilities-telugu-news-7760337 Dec 04, 2024 16:47 IST తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని ఇది మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ కావాడం గమనార్హం. https://rtvlive.com/telangana/google-to-set-up-safety-engineering-center-in-hyderabad-telugu-news-7760242 Dec 04, 2024 15:54 IST హైకోర్టులో హరీష్ రావు క్వాష్ పిటిషన్.. పోలీసులకు ఆదేశాలు! మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్లులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తనమీద నమోదైన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని ఫిటిషన్ లో పేర్కొన్నారు. Dec 04, 2024 15:24 IST Telangana: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తంచిన టీచర్‌కి దేహశుద్ధి మంచిర్యాలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో తరగతి గదిలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే.. మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ, పైశాచిక ఆనందం పొందుతున్న టీచర్ సత్యనారాయణకు చెప్పులతో కొట్టి దేహశుద్ది చేశారు. https://rtvlive.com/telangana/teacher-who-misbehaved-with-female-students-in-purified-mancharya-telugu-news-7759696 Dec 04, 2024 14:53 IST Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..! వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం. https://rtvlive.com/telangana/honey-trap-blackmail-wajedu-si-harish-7759660 Dec 04, 2024 13:28 IST ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. దాదాపు రెండున్నరేళ్లు సీఎంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిన మరాఠా నాయకుడు ఏకనాథ్ సిండేను కాదని ఫడ్నవిస్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కడం వెనక ఆరు బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూడండి. Also Read : https://rtvlive.com/national/maharashtra-why-devendra-fadnavees-became-cm-here-is-6-reasons-7645444 Dec 04, 2024 13:25 IST 71 ఏళ్ళ వృద్ధుడికి కుచ్చుటోపి.. 1.4 కోట్ల రూపాయలు దోచేసిన కేటుగాళ్లు! డిజిటల్ అరెస్టు మోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 71ఏళ్ళ వృద్ధుడి నుంచి 1.4 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని.. బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. Also Read : https://rtvlive.com/crime/digital-arrest-cybercriminals-extort-rs-15-crore-from-71years-old-man-telugu-news-7759595 Dec 04, 2024 12:42 IST హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్! హైదరాబాద్ లో నేడు మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరం శాఖా అంచనా. అలాగే ఏపీలోని కొన్ని కోస్టల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. Also Read : https://rtvlive.com/weather/hyderabad-telangana-andrapradesh-todays-weather-report-telugu-news-7759384 Dec 04, 2024 11:51 IST మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. అధికారిక ప్రకటన విడుదల! మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. పది రోజులు సస్పెషన్స్ తర్వాత ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశంలో ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 5న ప్రమాణస్వీకారం చేయనున్నారు. Also Read : https://rtvlive.com/national/maharashtra-cm-fadnavis-official-announcement-telugu-news-7759326 Dec 04, 2024 11:47 IST టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అడిగినన్ని లడ్డూలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్న లడ్డూలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లడ్డూ పోటు సిబ్బంది నియామకంపై ఫోకస్ పెట్టింది. Also Read : https://rtvlive.com/andhra-pradesh/ttd-to-take-key-decision-on-additional-tirumala-laddus-7759224 Dec 04, 2024 11:26 IST ఈరోజు ఘనంగా నాగచైతన్య - శోభిత పెళ్లి.. గెస్ట్ లిస్ట్ ఇదే అక్కినేని నాగచైతన్య- శోభిత ఈరోజు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్థూసియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 8 గంటలకు వివాహం జరగనుంది. వీరి పెళ్ళిలో చిరంజీవి, రామ్‌చరణ్, మహేష్, ప్రభాస్, రాజమౌళి అతిథులుగా సందడి చేయనున్నారు. Also Read : https://rtvlive.com/cinema/naga-chaitanya-sobhita-wedding-today-night-annapoorna-studios-guest-list-telugu-news-7759080 Dec 04, 2024 09:54 IST డొనాల్డ్ ట్రంప్‍పై హష్ మనీ కేసు కొట్టేయాలని విజ్ఞప్తి డొనాల్డ్ ట్రంప్ ను హష్ మనీ కేసు నుంచి తప్పించాలని ఆయన లీగల్ టీం న్యూయార్క్ న్యాయమూర్తి కోరింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి అది అడ్డుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. Also Read : https://rtvlive.com/international/a-plea-to-drop-the-hush-money-case-against-donald-trump-7758859 Dec 04, 2024 09:53 IST తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు తెలుగు రాష్టాల్లో స్వల్పంగా భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Also Read : https://rtvlive.com/telangana/telangana-andhra-states-in-minor-earth-quakes-today-morning Dec 04, 2024 09:52 IST సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ వేటు..! ఏపీ సీఐడీ మాజీ ఏడీజీ ఎన్. సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. ఈ సమయంలో ఆ విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలువచ్చాయి. Also Read : https://rtvlive.com/andhra-pradesh/ap-government-suspends-senior-ips-and-former-cid-chief-n-sanjay-7758883 Dec 04, 2024 09:51 IST బిల్లు ఆమోదం.. ఇకపై బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు బ్యాంకు ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను ఎంపిక చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ఆమోదించారు. అయితే కేవలం సాధారణ అకౌంట్లకే కాకుండా ఫిక్సిడ్ డిపాజిట్లకు కూడా నలుగురు నామినీలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. Also Read : https://rtvlive.com/business/bank-accounts-can-now-have-up-to-four-nominees-7758922 Dec 03, 2024 21:02 IST Tamil Nadu: మంత్రిపై బురద చల్లిన వరద బాధితులు.. వీడియో వైరల్ తమిళనాడు, పుదుచ్చేరితో సహా ఇతర ప్రాంతాల్లో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించగా బాధితులు ఆయనపై బురద చల్లారు. https://rtvlive.com/national/locals-throw-mud-on-tamil-nadu-minister-during-visit-to-cyclone-hit-area-7758308 Dec 03, 2024 20:39 IST Lucknow airport: ప్లాస్టిక్ బాక్స్‌లో నెలరోజుల బేబీ.. ఫ్లైట్‌లో కొరియర్..! లక్నోలో ఓ ప్లాస్టిక్ బాక్స్ లో నెల రోజుల ఐవీఎఫ్ బాబును పెట్టి కొరియర్ చేయాలని చూశారు. ఓ జంట టెస్టుల కోసం ముంబై పంపుతున్న ఆ బాక్స్ రోడ్ ద్వారా డెలవరీ కావాల్సింది.. పొరపాటున ఫ్లైట్ లోకి వెళ్లిందని బ్లూ డార్ట్ కొరియర్ సంస్థ చెబుతుంది https://rtvlive.com/national/ivf-baby-body-found-in-courier-box-in-lucknow-airport-7758201 Dec 03, 2024 20:15 IST సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దేశంలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా'ను ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నాయని, నార్త్ కొరియా వైపు సానుభూతిని చూపిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు https://rtvlive.com/national/south-koreas-president-declares-emergency-martial-law-7758236 Dec 03, 2024 18:29 IST మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ.. ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్‌వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. https://rtvlive.com/business/meesho-by-placing-fake-orders-cyber-criminals-made-5-crores-7757835 Dec 03, 2024 18:12 IST బిల్డింగ్స్, లే అవుట్ల పర్మిషన్లకు.. తెలంగాణలో కొత్త ఆన్లైన్ సిస్టమ్ తెలంగాణలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. బిల్డ్ నౌ అనే ఆన్ లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిసెంబర్ 3న సెంక్రటేరియట్ లో బిల్డ్ నౌ ను ప్రారంభించారు. https://rtvlive.com/telangana/telangana-government-has-come-up-with-a-new-policy-for-granting-construction-permits-7757795 Dec 03, 2024 17:55 IST Bomb Threat: తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు.. తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఏ వస్తువు బయటపడలేదు. చివరికి ఇది బూటకమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. https://rtvlive.com/national/bomb-scare-at-taj-mahal-turns-out-to-be-hoax-7757697 Dec 03, 2024 16:29 IST HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల! హైడ్రాకు రేవంత్ సర్కార్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. https://rtvlive.com/telangana/telangana-government-rs50-crore-funds-released-for-hydra-telugu-news-7757334 Dec 03, 2024 16:16 IST మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఈక కూడా పీకలేవ్: హరీష్ రావ్ వార్నింగ్ లక్ష తప్పుడు కేసులు పెట్టిన తనను ఏమీ చేయలేరని హరీష్ రావు అన్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాలన్నీ బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. https://rtvlive.com/telangana/harish-rao-serious-warning-to-cm-revanth-reddy-telugu-news-7757311 Dec 03, 2024 15:08 IST డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం! కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 10 చివరితేదీగా వెల్లడించారు. https://rtvlive.com/job-notifications/karnataka-bank-released-probationary-officer-scale-posts-7757070 Dec 03, 2024 14:04 IST ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! ‘ఆయుర్వేద చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వ నాశనం అవుతాయి’ అని కవర్‌పై రాసి మరీ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. Also Read : https://rtvlive.com/andhra-pradesh/ganja-laced-chocolates-caught-in-palnadu-narasaraopet-7756888 Dec 03, 2024 13:41 IST హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. Also Read : https://rtvlive.com/telangana/phone-tapping-issue-case-registered-on-harish-rao-telugu-news-7756862 Dec 03, 2024 13:35 IST తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి.. ఈ ఇద్దరిలో ఎవరు!? తెలంగాణలో బీజేపీకి కొత్త రథసారథి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, డీకే అరుణ మధ్య పోటీ ఉండగా ఈటలవైపు మొగ్గు చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. Also Read : https://rtvlive.com/telangana/telangana-bjp-president-tough-fight-between-etala-rajender-and-dk-aruna-telugu-news-7756776 Dec 03, 2024 12:13 IST పార్లమెంట్‌లో ప్రియాంక సీటు నెంబర్ ఫిక్స్.. ఆయన పక్కనే! పార్లమెంట్‌లో ప్రియాంక స్థానం ఖరారైంది. ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టనుండగా నాలుగో వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆమెకు సీటు నంబర్ 517 కేటాయించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి 19 సీట్ల గ్యాప్ ఉంది. Also Read : https://rtvlive.com/national/priyanka-parliament-seat-number-is-fixed-telugu-news-7756607 Dec 03, 2024 11:49 IST మాజీ బాయ్‌ఫ్రెండ్ హత్య కేసులో.. బాలీవుడ్ నటి సోదరి అరెస్టు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. జంటహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. Also Read : https://rtvlive.com/international/bollywood-actress-nargis-fakhri-sister-aliya-fakhri-arrested-for-new-york-double-murder-7756508 Dec 03, 2024 11:27 IST అలా 1 నొక్కాడు..ఇలా లక్ష పొగొట్టుకున్నాడు! అహ్మదాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ డిజిటల్ అరెస్ట్ తో అక్షరాల లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. వచ్చిన పార్మిల్‌ను తిరిగి పంపడానికి మొబైల్ లో 1 నొక్కమని మోసగాళ్లు చెప్పారు. నొక్కగానే అతని అకౌంట్ నుంచి లక్ష రూపాయలు కట్ అయినట్లు గుర్తించాడు. Dec 03, 2024 10:17 IST విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు 11,498 కోట్ల వ్యయం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. Also Read : https://rtvlive.com/andhra-pradesh/visakhapatnam-vijayawada-metro-rail-at-andhra-pradesh-government-approves-7756191 Dec 03, 2024 07:44 IST టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. Also Read : https://rtvlive.com/andhra-pradesh/former-deputy-cm-alla-nani-likely-to-join-in-tdp-7756023 Dec 02, 2024 21:20 IST pushpa 2 : 'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా రాజమౌళి.. ఆ సెంటిమెట్ రిపీట్ అవుతుందా? 'పుష్ప' ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్లుగా హాజరయ్యారు. పుష్ప-2 కోసం రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దీంతో ఈసారి కూడా పాన్ ఇండియా సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేసున్నారు. https://rtvlive.com/cinema/pushpa-2-pre-release-without-chief-guest-7670666 Dec 02, 2024 19:17 IST నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్ ఏపీలో తనపై నమోదైన కేసుల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై RGV అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇంటర్వ్యూలు ఇస్తున్నా. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా.. నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. https://rtvlive.com/cinema/ram-gopal-varma-sensational-comments-on-arrest-7665951 Dec 02, 2024 18:09 IST జైలు నుంచి బయటికొచ్చాక మరో అమ్మాయితో జానీ మాస్టర్.. వీడియో వైరల్ జానీ మాస్టర్ తాజాగా ఓ లేడీ డ్యాన్సర్ తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇటీవల ఆయన కొరియోగ్రఫీ చేసిన ఓ హిందీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అదే సాంగ్ కు లేడీ డ్యాన్సర్ తో కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. https://rtvlive.com/cinema/jani-master-dancing-with-lady-dancer-video-going-viral-7665558 Dec 02, 2024 16:11 IST Perni Nani: పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీపై మాజీ మంత్రి సెటైర్లు ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పోర్ట్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ ప్రాణాలకు తెగించి పవన్ చేసిన సాహాసంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. https://rtvlive.com/andhra-pradesh/former-minister-satirizes-pawan-kalyan-ship-inspection-7665092 Dec 02, 2024 15:02 IST బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్ 'పుష్ప2' హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన స్త్రీ2(41k), డంకీ (42k), యానిమల్ (52.5k), టైగర్3 (65k) సినిమాలను ‘పుష్ప2’ అధిగమించింది. https://rtvlive.com/cinema/allu-arjun-pushpa-2-creates-new-record-in-pre-sales-7665078 Dec 02, 2024 13:02 IST అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లేది ఆ కేసులకే.. రిపోర్టులో సంచలన విషయాలు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో గర్భిణీలను, రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్లని ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులకే అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 7.7 లక్షల ఎమర్జెన్సీ కేసులకు అంబులెన్సులు వెళ్లాయని పేర్కొంది. Also Read : https://rtvlive.com/telangana/pregnancy-and-road-trauma-top-emergency-cases-in-telangana-7664648 Dec 02, 2024 12:07 IST ముదురుతున్న మెగా వివాదం.. మరోసారి నాగబాబు ట్వీట్ వైరల్! నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. ''తప్పుడు మార్గంలో వెళ్తున్నావని గుర్తిస్తే మంచిది. లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం'' అని ఓ కోట్ పెట్టారు. దీంతో పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ పెట్టారా? అని అంటున్నారు నెటిజన్లు. "If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong".- Swami Vivekananda. — Naga Babu Konidela (@NagaBabuOffl) December 1, 2024 Also Read : https://rtvlive.com/cinema/nagababu-tweet-viral-allu-arjun-pushpa-2-release-telugu-news-7664401 Dec 02, 2024 09:59 IST మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) మరో చరిత్ర సృష్టించనుంది. సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 4న ప్రోబా-3 మిషన్‌ను ఏపీలోని శ్రీహరికోట నుంచి ఇస్రో ఆధ్వర్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించనునుంది. Also Read : https://rtvlive.com/national/isro-to-launch-esas-proba-3-mission-on-december-4-7664095 Dec 02, 2024 09:57 IST ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్ టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. Also Read : https://rtvlive.com/andhra-pradesh/ap-minister-nara-lokesh-emotional-tweet-on-tdp-follower-srinu-death-7664020 show more మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి