కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా రాష్ట్ర గీతం రచించిన.. విగ్రహావిష్కరణ తర్వాత ఒకవైపు సీఎం ప్రసంగిస్తుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానిస్తారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించిన కవి అందెశ్రీని, విగ్రహ రూపకర్తలు అయిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం సన్మానిస్తారు. విగ్రహావిష్కరణ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తారు. ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! ఇకపై ప్రతీ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బంగారు అంచుతో కూడిన పచ్చటి చీరతో తయారు చేశారు. ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళలా ప్రతిబింబించేలా ఆవిష్కరించారు. చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఎత్తు 17 అడుగులతో నిర్మించగా.. మరో 3 అడుగులతో కిందిగద్దె రూపొందించారు. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం చుట్టూ పచ్చిక బయళ్లు, ఫౌంటేయిన్ వంటివి ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడండి: తెలుగు మహిళకు అత్యున్నత పదవి