Revanth Vs TGSP: బానిస బతుకులు బతుకుతున్నాం..!

రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తమ బాధను అర్ధం చేసుకోవాలని అన్నారు.

New Update
revanth3

Revanth VS TGSP:  టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , డీజీపీ జితేందర్ కు, అలాగే టీఎస్ఎస్పీ ఏడీజీపీకి వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం అమలు కోసం తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటితో తమ బాధను అర్ధం చేసుకోవాలని లేఖ రాశారు. తాము శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్నామని, రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని కోరారు. తీవ్ర ఒత్తిడిలో రిజర్వ్డ్ పోలీస్ కుటుంబాలు తాము ఒక చోట తమ భర్తలు మరోచోట ఉండాల్సి వస్తుందని, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వారు రాలేకపోతున్నారని, అయితే తమకు సెలవు కావాలని గట్టిగా అడిగితే పై అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారు తమ గోడు వ్యక్తం చేశారు. 

Also Read:  చిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

కుటుంబాలకు దూరంగా వారు, మాకు అవసరం అయినప్పుడు అండగా మా వాళ్ళు లేకపోవటం కారణంగా మేము చాలా ఒత్తిడికి గురవుతున్నామని పేర్కొన్నారు.  ఒక్కోసారి రెండు నెలలైనా ఇంటికి రాని పరిస్థితులు మమ్ములను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఉద్యోగానికి ఆబ్సేంట్ కాలేక ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారని వాపోయారు.

Also Read:  అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్‌ కే!

నెలల పాటు దూరంగా ఉండటం కారణంగా ఇంటికి వచ్చిన తండ్రిని సొంత బిడ్డలు గుర్తు పట్టటం లేదని, తండ్రి ప్రేమకు దూరంగా తమ పిల్లలు పెరుగుతున్నారని అన్నారు. పశువుల కొట్టం కంటే దారుణంగా వసతి అదే విధంగా హైదరాబాదులో టీజీఎస్పీ వారికి ఇచ్చే వసతి కూడా దారుణం అన్నారు. హుస్సేనీ ఆలం, కవాడిగూడ, రాజేంద్రనగర్, బేగంపేట్ మొదలగు పోస్టింగ్స్ పశువులు, పందులు నివసించే దానికన్నా దారుణంగా ఉంటాయని, అలాంటి చోట తమ వారిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:  ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

 చిన్న చిన్న రూములలో పది పది మందికి పైగా ఉంటూ.. అందులోనే టాయిలెట్స్, ఆ దుర్వాసనలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. దయచేసి తామంతా ఎందుకు ఆవేదనలో ఉన్నామో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాము జీతాలు పెంచాలని, టీఏ, డీఏ పెంచాలని ఆందోళన చేయటం లేదని, ఇందులో ఎలాంటి ప్రలోభాలు, ఎవరి ప్రమేయాలు లేవని పేర్కొన్నారు. మా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇది నిజం అంటూ వారు తమ కన్నీటి లేఖలో పేర్కొన్నారు. సివిల్ కానిస్టేబుల్ తరహాలో తమకు కూడా కుటుంబంతో గడిపేలా సమయం ఇచ్చేలా డ్యూటీలు ఇవ్వాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని వారు లేఖలో పేర్కొన్నారు.

Also Read: గురుకుల విద్యార్థులకు ఆ సదుపాయాలు అందించాలి: మంత్రి పొన్నం


 రేవంత్‌ ఇంటి టీజీఎస్పీ పోలీసుల తొలగింపు

 

తెలంగాణలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేయాలని గత కొన్నిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర ఉంటున్న కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించింది. ఏ క్షణమైనా కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తారనే అనుమానంతో భద్రతా విధుల నుంచి తొలగించింది. అలాగే డీజీపీ ఆఫీస్, యూఎస్‌ కాన్సులేట్‌ దగ్గర కూడా టీజీఎస్పీ కానిస్టేబుళ్లను భద్రతా విధుల నుంచి తొలగించింది. 

స్పెషల్ పార్టీ పోలీసులతో ఆయా చోట్ల భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు సెక్రటేరియట్ దగ్గర ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవద్దని, వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టొద్దని చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్‌ పేరుతో మెమో జారీ చేశారు. ఏ తప్పు చేసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

10 మంది డిస్మిస్‌ 


పోలీస్‌ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. ఇప్పటికే 39 మందిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం వారిలో తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్‌ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదిమంది కానిస్టేబుళ్లు బెటాలియన్స్ లో అశాంతికి ప్రధాన కారణమయ్యారని డీజీపీ కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

పదిమంది కానిస్టేబుల్ వల్లనే మిగతావాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొంది. కానిస్టేబుల్ ఆందోళనకు ఈ పదిమంది కారణమయ్యారని తెలిపింది. యూనిఫామ్, క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కు విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు