New Update
/rtv/media/media_files/2026/04/24/tgsrtc-issue-2026-04-24-21-34-52.jpg)
TGSRTC Issue
ఆర్టీసీ జేఏసీతో తెలంగాణ మంత్రులు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. మొత్తం 32 డిమాండ్లపై చర్చలు నిర్వహించగా.. దాదాపు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ఓకే చెప్పింది. ఇందుకోసం హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చింది. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని మంత్రులు జేఏసీకి తెలిపినట్లు సమాచారం. మరి కొద్ది సేపట్లో ఈ విషయంపై మంత్రులు, జేఏసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
తాజా కథనాలు
Follow Us