వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో మరో 40 మంది పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అధికారులపై దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 70 మందిపై కేసు నమోదు చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 29 మంది అరెస్ట్ కాగా.. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. కేసులో ఉన్న మరి కొంత మందిని తాజాగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు కొందరు ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియోల ఆధారంగా ఇప్పుడు పోలీసులు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు? కుట్ర కోణం ఉందా? అయితే.. కేవలం ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారు? అన్న కోణంలో మాత్రమే కాకుండా.. వీరికి ఎవరెవరు సహకరించారు? ఏదైనా కుట్ర జరిగిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో బహుళార్థ సాధక పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులు ఆందోళనలు ఆపుతారా? లేక కొనసాగిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: VRO వ్యవస్థపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ 11 వేల మందికి బాధ్యతలు! ఇదిలా ఉంటే.. లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదు అయిన మూడు FIR లలో రెండు FIRలను హైకోర్టు కొట్టేసింది. కాగా ఒక ఘటనలో మూడు FIRలు నమోదు చేయడం చట్టవిరుద్ధం అని పట్నం నరేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ FIRలను కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. రెండు FIRలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.