హైడ్రా కూల్చివేతలను ఆపం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడూ కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల14కి వాయిదా వేసింది.

New Update
Hydra..

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కె.ఎ.పాల్ కోరారు. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని కె.ఎ.పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడూ కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్‌పర్సన్‌గా కె.ఎ.పాల్ వాదనలు వినిపించారు.

ఈ నెల14కి వాయిదా

అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు. దీంతో పాల్ వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తూ.. తదుపరి విచారణను ఈ నెల14కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి : హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు

కాగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి నుంచి రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా పెట్టుకుంది. వరుసగా అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 

అయితే ప్రారంభంలో హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. కానీ అంతకంతకూ హైడ్రాపై నిరసనలు వెల్లువెత్తాయి. అందుకు కారణం పేదల అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే అని తెలుస్తోంది. పలు చోట్ల స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ బోరున విలపిస్తున్నారు. ఇంకొంతమంది హైడ్రాను ఆపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు