/rtv/media/media_files/2025/04/07/3nT8PIenQzfj6enWJ7e8.jpg)
tg-high-court-hcu
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 2025 ఏప్రిల్ 07వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సీనియర్ అడ్వకేట్‌గా మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు. కాగా కంచ గచ్చిబౌలి భూములలో పనులు ఆపేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది.
Also Read : Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!
మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తప్పుడు, మార్ఫింగ్ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్‌కు నోటీసులు ఇచ్చిన గచ్చిబౌలి పోలీసులు
— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025
కంచ గచ్చిబౌలి భూముల్లో AI ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.
ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకి రావాలని నోటీసులు జారీ చేసిన పోలీసులు. pic.twitter.com/WsNAWPLs1E
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!