/rtv/media/media_files/2024/11/15/kZwI5ULb4XVKc0qZJdmr.jpg)
Patnam Narender Reddy: లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదు అయిన మూడు FIR లలో రెండు FIRలను హైకోర్టు కొట్టేసింది. కాగా ఒక ఘటనలో మూడు FIRలు నమోదు చేయడం చట్టవిరుద్ధం అని పట్నం నరేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ FIRలను కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. రెండు FIRలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్!
ఇటీవల పట్నం వీడియో వైరల్..
వీడియోలో పట్నం నరేందర్ రెడ్డి ఇలా మాట్లాడారు.. మొన్న జరిగింది ట్రైలరే.. రాబోయే రోజుల్లో డబుల్, త్రిబుల్ దాడులు ఉంటాయని అన్నారు. ఫార్మా కంపెనీ పేరిట వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి కొడతామని అన్నారు. మీకు నేను, కేటీఆర్, హరీష్‌రావు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!
అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ అన్నారన్న.. మళ్లో సారి వస్తే కేటీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పారు. ఎవరొస్తరో రానీయండి చూసుకుందామని.. ఫార్మాను రద్దు చేసే వరకు మీ వెంటనే ఉంటామని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వీడియోతో పాటు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చెప్పిన విషయాలు ఆధారం చేసుకొని పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ పై సస్పెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.
Thatikonda Rajaiah vs kadiyam srihari
Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిపడ్డారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి