చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వైరస్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడూ నమోదు కాలేదని పేర్కొంది. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందొద్దని తెలిపింది. ఈ వైరస్ సోకినవారిలో కూడా దాదాపు కొవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయని తెలిపింది. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. జాగ్రత్తలు 1. తరచూ చేతులు శానిటైజ్ చేసుకోవాలి2. తుమ్ము-దగ్గు వచ్చినప్పుడు కర్చీఫులు లేదా టిస్యూ అడ్డు పెట్టుకోవాలి3. పోషికాహారం బాగా తినాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి4. అనారోగ్యంగా అనిపిస్తే.. ఇంట్లోనే ఉండాలి5. ఇతరులతో కరచాలనం అస్సలు చేయొద్దు6. వాడిన కర్చీఫులు, టిస్యూ పేపర్లు మళ్లీ వాడొద్దు7. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు8. వైద్యుల సహకారం లేకుండా మెడిసిన్స్ తీసుకోవద్దు9. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలి చైనాలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న HMPV అనే కొత్త వైరస్ఈ వైరస్ సోకిన వారిలో దాదాపు కొవిడ్-19 లాంటి లక్షణాలురోగులతో చైనాలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతుండటంతో..ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన తెలంగాణ సర్కార్ఈ నేపథ్యంలోనే.. ప్రజలకు కొన్ని సూచనలు జారీ * తరచూ చేతులు శానిటైజ్… pic.twitter.com/LnNZn85cgX — Pulse News (@PulseNewsTelugu) January 4, 2025 Also Read: తెలంగాణలో మరో ఘోరం.. గర్ల్స్ టాయిలెట్స్‌లో మొబైల్ కెమెరాతో వీడియో! ఇదిలాఉండగా ప్రస్తుతం చైనాలో HMPV వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికి గురైన బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఈ హెచ్‌ఎంపీవీ వైరస్‌పై చైనా కూడా స్పందించింది. ఈ వైరస్ వల్ల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను ఖండించింది. శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపింది. అంతేకాదు విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.