BREAKING: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! TG: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న రూ.2 లక్షలు రుణమాఫీ కానీ వారందరికీ రుణమాఫీ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు By V.J Reddy 28 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Runamafi: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రూ.2లక్షల వరకు రుణమాఫీ కానీ దాదాపు న్ లక్షల మంది రైతులకు ఈ నెల 30న రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పాలమూరులో జరగనున్న రైతుపండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ డబ్బులను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని.. ఈ నెల 30న రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ జరగనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇది కూడా చదవండి: మరో సారి పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్.. ఫొటోలు వైరల్! మాది రైతు ప్రభుత్వం... కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు మంత్రి తుమ్మల. తెలంగాణలోని రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితి పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.47 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. పెట్టిన బడ్జెట్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు రూ.18 వేల కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. అలాగే రైతు బంధు కొరకు రూ.7,600 కోట్లు వాడినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు! అయితే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం తదితర కారణాలతో దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని అన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు గత 3 నెలలుగా ఇలాంటి రైతుల వివరాలు సేకరించి, తప్పులను సరి చేసినట్లు వెల్లడించారు. వారందరికీ ఈ నెల 30న రుణమాఫీ జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ‘రైతు బీమా’ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు కీలక ప్రకటన చేశారు. #cm-revanth-reddy #telangana-farmers #thummala-nageshwara-rao #runamafi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి