10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

TG: 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదని.. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని పేర్కొంది.

New Update
AP Tenth Exams 2023: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

10th Exam Fees: తెలంగాణలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే ప్రధానోపాధ్యాయులు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని పేర్కొంది. కాగా ఇంతక ముందు వరకు స్కూల్ యాజమాన్యాలు బ్యాంకులకు వెళ్లి చలానా కట్టే వారు.. దీంతో తీవ్ర ఇబ్బందిని అటు విద్యార్థులు..  ఇటు విద్యాసంస్థలు ఎదుర్కునేవి. తాజాగా దీనిపై రేవంత్ సర్కార్ చలానా విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించేలా మార్పు చేసినట్లు తెలిపింది.

డిసెంబర్ 21వ తేదీ వరకు..

ఇటీవల తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 50 రూపాయల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 2వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అలాగే 200 రూపాయల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 12వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు. 

అంతే కాకుండా 500 రూపాయల ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించారు. రెగ్యుల‌ర్ స్టూడెంట్స్‌ అన్ని పేప‌ర్లకు క‌లిపి 125 రూపాయలు, మూడు కంటే త‌క్కువ పేప‌ర్లు ఉంటే 110 రూపాయలు, మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment