ప్రిన్సిపల్, మెస్ ఇంఛార్జ్ తిన్నాకే పిల్లలకు పెట్టండి..

ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపల్, ఫుడ్ ఇంచార్జ్ భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగదిలో సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలని స్పష్టం చేసింది.

author-image
By srinivas
New Update
Food poisoning

TG News: ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపల్, ఫుడ్ ఇంచార్జ్ భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వండిన ఆహారాన్ని పూర్తిగా పరిశీలించాకే విద్యార్థులకు వడ్డించాలని సూచించింది. అలాగే వంట గదిలో కిచెన్ సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ తప్పనిసరి ధరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.  రెండు పూటలకు పప్పు ఒకేసారి వండొద్దు. భోజనం వేడివేడిగానే వడ్డించాలి. చలి ఆహార పదార్థలు పెట్టకూడదు. పురుగులు, బూజు పట్టిన బియ్యాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. 

హైకోర్టు సంచలన తీర్పు..


ఇదిలాఉంటే.. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇటీవల వరుస ఫుడు పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులకు నిర్దేశించిన పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కలుషిత ఆహారం కారణంగా బడి పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన పూర్తి నివేదికను సమర్పించాలని సూచిస్తూ తదుపరి విచారణను మరో 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: దారుణం.. సహజీవనం చేయలేదని ఏం చేశాడంటే?

రెండు కమిటీలు ఏర్పాటు..


ఇక ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యులైన వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంచి భోజనం పెట్టేందుకు ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచినట్లు తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్నారు. కమిటీల పర్యవేక్షణ సరిగా లేనందుకే ఇలా జరుతున్నాయని చెప్పారు. కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీంతో అన్ని కమిటీలు పని చేస్తున్నాయని ప్రభుత్వ ఏఏజీ వివరించారు. 

ఇది కూడా చదవండి: Ap: ఏపీ విద్యార్థులకు గోల్డెన్‌ న్యూస్‌..ఉచితంగా రూ. 50 వేల వరకు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు