TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. విద్యుత్ బిల్లుల పెంపుపై కీలక నిర్ణయం తెలంగాణ ప్రజలకు రేవంత్ దీపావళి సందర్భంగా ఓ శుభవార్తను చెప్పింది.విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. By Bhavana 29 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ దీపావళి సందర్భంగా ఓ శుభవార్తను చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపుపై నెలకొన్న ఉత్కంఠకు ఈఆర్సీ ఓ క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. డిస్కంలు దాఖలు చేసిన మొత్తం 8 పిటిషన్లపై 2024, అక్టోబర్ 28న ఈఆర్సీ తన అభిప్రాయాలు తెలిపింది. Also Read: ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య వార్ ఈ సందర్భంగా ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు మీడియాతో మాట్లాడుతూ.. స్థిర ఛార్జీలు రూ.10 అలాగే ఉంటాయని చెప్పారు. అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా నిర్ణయం వెల్లడించాలని ఈఆర్సీ నిర్ణయించిందని అన్నారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరించామన్నారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. Also Read: బానిస బతుకులు బతుకుతున్నాం..! ఆ ఛార్జీలు యథాతథం.. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదన్నారు. స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించామని చెప్పారు. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదని.. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని తెలిపారు.132kva, 133kva, 11kv లలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉండనున్నట్లు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించిందని.. అయితే, టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. Also Read: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్ కే! రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచామన్నారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్‌ను పెంచామని.. హార్స్ పవర్ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచామని వెల్లడించారు. గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు కమిషన్ ఆమోదించిందని తెలిపారు. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని వెల్లడించారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ. 54,183.28 కోట్లు ఆమోదించిందని తెలిపారు. Also Read: చిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి