New Update
/rtv/media/media_files/nl84wemux9gRDXV2cMsS.jpg)
ఈనెల 20న తెలంగాణ కేబినెట్ బేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టం, కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మిగిలిన ఎన్నికల హామీల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.