Modi: టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ.. అక్కడ భారీ మీటింగ్ కు ప్లాన్!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీతో భారీ మీటింగ్ BJP ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు అక్కడి నుంచే శంఖారావం పూరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నిన్న మోదీని కలిసిన బీజేపీ నేతలు బాసరను సందర్శించాలని మోదీని కోరారన్న చర్చ సాగుతోంది.

New Update
Narendra Modi Telangana BJP

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు సమానంగా 8 సీట్లను గెలుచుకుంది. దీంతో తమకు ఇక్కడ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని బీజేపీ భావిస్తోంది. దీంతో ఇక్కడ మరింత దూకుడుగా వెళ్లాలని పార్టీ నేతలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని ఆయన దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అమలుకు పోరాడాలని.. అదే సమయంలో బీఆర్ఎస్ ను సైతం టార్గెట్ చేయాలని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా రాష్ట్రంలో బీజేపీ బలం పెంచేలా పని చేయాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై రేవంత్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

మోదీని ప్రత్యేకంగా కలిసిన ఆదిలాబాద్ నేతలు..

అయితే.. నిన్న భేటీ సందర్భంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు,పీఎం మోదీని ప్రత్యేకంగా కలిశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకోవడానికి రావాలని వారు ప్రధానిని కోరారు. అయితే.. ప్రధానిని ఆహ్వానించి రాష్ట్రంలో త్వరలో భారీ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్ ఎంపీ సీటులో సైతం సత్తా చాటింది. దీంతో ఇక్కడి నుంచి శంఖారావం పూరించాలని బీజేపీ నేతలు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు

స్థానిక ఎన్నికలకు ముందే ప్రధానితో మీటింగ్ నిర్వహిస్తే.. శ్రేణుల్లోనూ జోష్‌ వస్తుందని నేతలు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ చివరలో ఆదిలాబాద్ లో మోదీ మీటింగ్ ఉండే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన భేటీపై మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారన్నారు.

అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారన్నారు.

Also Read: Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)అను మహిళను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

New Update
Bhadradri Kothagudem crime news

Bhadradri Kothagudem crime news

TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఇస్లావత్ దీపిక (19)కు ఆరు నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దికాలం దాంపత్య జీవితం అనుకూలంగా సాగింది. కానీ వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెపై భర్త శ్రీను, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా దీపికపై నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.

ప్రాణం తీసిన అదనపు కట్నం..

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినది. దీపికను భర్త శ్రీను, అత్తమామలు కలిసి దాడి చేశారు. సాయంత్రానికి పరిస్థితి మరింత విషమంగా మారింది. భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుమందు, ఎలుకల మందు కలిపి దీపికకు తాగించాడు. దీని తరువాత తాను కూడా అదే విషపు మిశ్రమాన్ని తాగాడు. దీనివల్ల ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న దీపిక పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే మృతి చెందింది. శ్రీను పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీపిక తండ్రి వత్మాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయస్సులోనే గర్భంతో ఉన్న కూతురును కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలాంటి ఘోరమైన చర్యకు ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపికకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి

( ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు