KTR: బీజేపీలో చిచ్చు పెట్టిన కేటీఆర్.. ఎంపీలు షాకింగ్ కామెంట్స్!

TG: కేటీఆర్ ఢిల్లీ పర్యటన బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. BRS, BJP ఒకటి కాబట్టే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా కమలం నేతలు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తంటాలు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
BJP 3rd

Telangana BJP : బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని మరోసారి ఇరకాటంలో పెట్టారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణలో మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ జరిగిన ప్రచారాన్ని తెర మీదకు వచ్చేలా చేసినట్లు అయింది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధాన్ని నిదర్శనం అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అందుకే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఈ ప్రచారం భారీ డ్యామేజీని తెచ్చిన సంగతి తెలిసిందే.

Also Read :  అరెస్ట్ కాబోతున్నా.. పార్టీ నేతల వద్ద కేటీఆర్ ఎమోషనల్!

డ్యామేజ్ కంట్రోల్‌లో బీజేపీ..?

బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే డ్యామేజీ కంట్రోల్ పనులను మొదలు పెట్టింది. కమలం నేతల తంటాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి ఆఫీస్ లో కేటీఆర్ ఫోటోలు దిగి షో చేశారని ట్వీట్ చేశారు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్.. ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలిసారో అక్కడి కాంగ్రెస్ నేతలు వెరిఫై చేసుకోవాలంటూ కొండ హితవు పలికారు. 

Also Read :  శ్రీచైతన్యలో మరో దారుణం.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో అరెస్ట్ చేస్తారేమో అనే భయంతోనే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు వెళ్లరేమో ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆరా తీయాలంటూ కొండ చురకలు అంటించారు. మరోవైపు పాత ముచ్చట పట్టుకొని కొత్త భూకంపం ఎందుకు వస్తదనుకుంటున్నవు..  మంత్రిని కలిసినవు ? ఎందుకు కలిశావు ? కలిసిన ఫోటో ఏది? భూకంపం ఎందుకొస్తది? అంటూ కేటీఆర్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కాగా కేటీఆర్ ఢిల్లీ టూర్ ను తిప్పి కోట్టకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.

Also Read :  మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్!

Also Read :  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR  : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ పూజ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

New Update
ktr

ktr

KTR  : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హ‌నుమాన్ దీక్షా స్వాముల‌కు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజ‌లో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్‌కు అర్చకులు వేదాశ్వీర‌చ‌నాలు అందించారు. హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా కేటీఆర్ వడ్డించారు. మాలాదారులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు చిత్రపటం అందించారు.అనంత‌రం హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ను కేటీఆర్ ఆప్యాయంగా ప‌లుక‌రించారు. స్వాముల‌తో క‌లిసి కేటీఆర్ భోజ‌నం చేశారు. కేటీఆర్‌తో స్వాములు ఫొటోలు దిగేందుకు ఆస‌క్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయ‌కులు ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment