TG MLC: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సంచలన వ్యూహం.. అభ్యర్థులు వీరే! TG: త్వరలో జరగనున్న MLC ఎన్నికలకు BJP కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున లిస్ట్ తయారు చేసి పరిశీలనకు హైకమాండ్ కు పంపించింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. By Nikhil 02 Nov 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లలో సత్తా చాటిన బీజేపీ.. అదే ఊపులో త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అందరికన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం ప్రారంభించడానికి ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా మూడు స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున లిస్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. పరిశీలన కోసం లిస్ట్ ను హై కమాండ్ కు పంపినట్లు సమాచారం. తెలంగాణలో త్వరలో ఉమ్మడి మెదక్ , నిజామాబాద్, అదిలాబాద్ , కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే నాలుగు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. దీంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: దానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు.. ఆ స్థానాల్లో తీవ్ర పోటీ.. మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లాకు రఘునాథ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో అంజిరెడ్డి మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. రఘునాథ్ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. టీచర్స్ స్థానానికి మల్క కొమురయ్య, మామిడి సుధాకర్ రెడ్డి పోటి పడుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మామిడి సుధాకర్ రెడ్డి పోటీ చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత అయిన మల్క కొమురయ్య గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ కోసం ప్రయత్నించారు. ఇది కూడా చదవండి: నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి పోటీ అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టికెట్ కోసం పోటీలో పోటీలో సర్వోత్తమ రెడ్డి, సాయిరెడ్డి ఉన్నారు. సర్వోత్తమ రెడ్డి PRTU మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కాగా.. సాయి రెడ్డి సంఘ్ పరివార్ కు చెందిన TUPS నాయకుడు. దీంతో వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనే అంశం ఉత్కంఠగా మారింది. #telangana-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి