Big Breaking: గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో నిరాశ

గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. పరీక్ష వాయిదాకు న్యాయస్థానం అంగీకరించలేదు. అభ్యర్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్న ఈ సమయంలో పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

New Update
GROUP 1

గ్రూప్1 పరీక్ష వాయిదాపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ విచారణలో భాగంగా గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మరికొద్ది గంటల్లో గ్రూప్1 పరీక్ష మొదలు కానుండగా.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అని తెలిపింది.

Also Read:  బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కి ప్రమాదం..!

హైకోర్టులోనే తేల్చుకోవాలి

అంతేకాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఫలితాల వెల్లడించడానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచించింది. నవంబరు 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు తెలిపింది.

Also Read: తెలంగాణలో బిహార్ ముఠా చోరీలు.. ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు 

కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఒకవైపు రాత పరీక్షకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందా? అని ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తెరపడింది. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇక పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

వాయిదా వేయాలి

ఇదిలా ఉంటే ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఇటీవల గ్రూప్‌ 1 అభ్యర్థులు అశోక్‌ నగర్, సచివాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ గ్రూప్-1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని.. జీవో 29ను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అభ్యర్థులంతా నిరాశ చెందుతున్నారు.

Also Read: 2027లోనే జమిలి ఎన్నికలు.. సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం !

144 సెక్షన్

కాగా మరి కొన్ని నిమిషాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరవ్వనున్నట్లు అధికారులు ఇప్పటికే తెలిపారు.

Also Read:  Prabhas మూవీలో హీరోయిన్ ఛాన్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన కరీనా కపూర్

రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరిలో 27 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఇక ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు