Defection MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్...ఆ పనిచేయాలని ఆదేశం

తెలంగాణలో ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు రాని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

New Update
 MLAs who changed parties

MLAs who changed parties

Defection MLAs : తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు రాని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మరోసారి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చింది. తాజాగా పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. నోటీసులు అందుకున్నఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

బీఆర్ఎస్ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ జనవరి 15న‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల‌పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌‌‌ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్‌‌‌‌ లీవ్‌‌‌‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌‌‌‌ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్‌‌‌‌ రెడ్డి, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎం.సంజయ్‌‌‌‌కుమార్, కాలె యాదయ్యలపై కేటీఆర్ రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. అయితే, అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం విచారణ చేపడుతోంది.

Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు. రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇక ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.

Also Read:  Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment