MLA Mahipal Reddy :కాంగ్రెస్‌కు షాక్..బీఆర్‌ఎస్‌కు ఓటేయమన్న మహిపాల్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.

New Update
FotoJet - 2026-02-09T180241.440

Patancheru MLA Mahipal Reddy

MLA Mahipal Reddy : మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వడం చర్చనీయంశంగా మారింది. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న మహిపాల్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.ఇటీవల జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కాంగ్రెస్ చేరడం వల్ల చిల్లీగవ్వ లాభం చేకూరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. 

కాగా గత ఎన్నికల తర్వాత పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారిపై బీఆర్ఎస్ అనర్హత వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో వారిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. అయితే ఆయన విచారణ చేసిన అనంతరం 8మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయమై బీఆర్ఎస్ మరోసారి సుప్రీంను ఆశ్రయించింది. కాగా త్వరలోనే తీర్పు వెలువడనుంది. అయితే మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులకు పడకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వారిని బీఆర్ఎస్ కు ఓటువేయాలని కోరడం గమనార్హం. అయితే.. కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మహిపాల్ రెడ్డి, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి సహా కొందరు అనుచరులు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. గ్రెస్ ప్రభుత్వం నుంచి తమ నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనాలు రాలేదన్న కారణంతో.. మహిపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన అధికారికంగా బీఆర్‌ఎస్‌లో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మహిపాల్ రెడ్డి.. ప్రస్తుతం ఆ పార్టీపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు