Koushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయనపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఏసీపీపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోస్థైర్యం దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సైతం మంత్రులు సీతక్క, సురేఖలపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు చేశారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! కారు, ఫోన్ సీజ్... కౌశిక్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని బంజారాహిల్స్ పీఎస్‌కు ఎస్సై విధులకు ఆటంకం కలిగించారని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలీసులు ఆయన కారుతో పాటు ఫోన్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లాక్ కోడ్ చెప్పడానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిరాకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిని కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి కౌశిక్ రెడ్డిపై మరో కేసు... కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులను బెదిరించారని ఆయనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు చేశారు. అరెస్టు కోసం వెళ్లినప్పుడు చనిపోతానని బెదిరించినట్లు FIRలో పేర్కొన్నారు. కాగా మరోసారి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. అయితే ఇటీవల పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు. ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం