Crop for the birds : పక్షులకోసం పంట వదిలేసింది...ఆకలి తీర్చి అమ్మయింది

ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. ఆకలితో ఉన్నబిడ్డలు తినకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఓ మహిళ పక్షుల ఆకలిని అర్థం చేసుకుంది. తల్లి'తనంతో ఆలోచించి పక్షుల కోసం సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.

New Update
Crop for the birds

Crop for the birds

Crop for the birds : ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. అందుకే అమ్మ పిల్లల కడుపే చూస్తుందంటారు. ఆకలితో ఉన్న బిడ్డలకు అన్నం పెట్టకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. మనషులైతే తమ ఆకలిని గురించి ఎదుటివారికి చెప్పగలరు. కానీ పక్షులు అలా చేయలేవు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ ఆ పక్షుల ఆకలి బాధను అర్థం చేసుకుంది. 'తల్లి' తనంతో ఆలోచించి పక్షుల కోసం తాను సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.

Also Read:Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన గొల్ల సునీతది నిరుపేద రైతు కుటుంబం. తమకున్న 28 గుంటల భూమిలోనే వ్యవసాయం చేస్తూ.. కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేది. 20 గుంటల విస్తీర్ణంలో శనగ పంటను వేసిన సునీత.. మిగిలిన 8 గుంటలలో నల్ల కుసుమ ( పొద్దు తిరుగుడు) పంటను సాగు చేశారు. అయితే నల్ల కుసుమ పంట చేతికి వచ్చే సమయానికి పిచ్చుకలు, పావురాలు, రామచిలుకలు తదితర పక్షులు వాటిని తింటూ ఆకలి తీర్చుకోవడాన్ని సునీత గమనించారు. నోరులేని పక్షుల ఆకలి బాధను ఓ 'తల్లి'గా అర్థం చేసుకున్నారు. పక్షులపై ఉన్న ప్రేమతో పంటను మొత్తం వాటికే వదిలేసింది.

Also Read: Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్!

అసలే ఎండా కాలం తినటానికి గింజ కూడా దొరకని ఈ సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, వివిధ పక్షులు నల్ల కుసుమలను తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయి. పొలం వద్ద బోర్లు ఉండగా.. ఆ నీటితో దాహాన్ని కూడా తీర్చుకుంటున్నాయి. ముందు పంటను కోయాలనుకున్నా.. పక్షుల ఆకలి బాధ అర్ధం చేసుకొని వాటికే వదిలేసినట్లు సునీత వెల్లడించారు. వాటి ఆకలిని తీర్చటం నిజంగా సంతోషాన్ని కలిగించిందని ఆనంద వ్యక్తం చేశారు. తమ పొలం దట్టమైన చెట్లు ఉండడంతో ఇక్కడ సేద తీరుతూ.. నోరులేని ఆ పక్షులు ఆకలి, దప్పికలు తీర్చుకుంటున్నాయని అంటున్నారు. నల్లకుసుల పంటతోపాటుగా.. శనగ పంట మధ్యలో వేసిన జొన్న పంటను కూడా వాటికే విదలేసినట్లు వెల్లడించారు.

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

ఆమె మంచి నమస్సును గ్రామస్తులు సైతం కొనియాడుతున్నారు. తల్లి స్థానంలో ఉండి వాటి ఆకలి బాధను అర్థం చేసుకుందని ప్రశంసిస్తున్నారు. పక్షి ప్రేమికులు సైతం ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నిజంగా ఆ తల్లిది గొప్పమనసని కొనియాడుతున్నారు.

Also Read:Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు