/rtv/media/media_files/2025/02/09/Q5xLceeIIPyQANKOxckI.webp)
Gurumurthy Remand
Gurumurthy Remand Report : మీర్‌పేట్‌లో భార్య మాధవీని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో వివరించారు. పంచాయతీ పెట్టి తన పరువు తీసినందుకే భార్యపై గురుమూర్తి కోపం పెంచుకొన్నాడని ఆ క్రమంలో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు వివరించారు. దానికోసం వేచిచూశాడు. అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు. అనుకున్నట్లే అంతం చేశాడని పోలీసులు వివరించారు.
Also Read : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!
తను ప్లాన్ అమలు చేయడానికి సమయం కోసం చూస్తున్న గురుమూర్తి జనవరి 15 న తన ప్లాన్ అమలుకు ఎంచుకున్నాడు. అనుకున్నట్లే తన పిల్లలను తన చెల్లెలు ఇంటి వద్ద వదిలేశాడు.16న తన పుట్టింటికి వెళ్తానన్న భార్య మాధవీతో గురుమూర్తి గొడవ పడ్డాడు. అదే సమయంలో తనకు..మీ చెల్లెలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని మాధవీ తేల్చి చెప్పడంతో పిల్లలను అక్కడే వదిలి భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను పుట్టింటికి ఎందుకు పంపడం లేదంటూ మాధవీ నిలదీయడంతో గురుమూర్తిలో అప్పటివరకు నిద్రపోతున్న సైకో నిద్రలేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. కోపంతో ఊగిపోయిన గురుమూర్తి భార్య మాధవి గొంతు పిసికి హత్య చేశాడు. హత్య అనంతరం అదే రోజు మాధవీ శరీరాన్ని ముక్కులుగా కట్ చేశాడు. అనంతరం వాటిని వాటర్ హీటర్‌తో ఉడికించాడు. అనంతరం ఎముకలను పొడిచేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్‌లో తీసుకెళ్లి పెద్ద చెరువులో పడవేశాడు. మరోవైపు అప్పటికే రెండు రోజులుగా తన కూతురు కనిపించకుండా పోవడంతో మాధవి తల్లికి అనుమానం వచ్చి గురుమూర్తిని నిలదీసింది. అయితే తనతో గొడవపెట్టుకుని ఎటో వెళ్లిపోయిందని గురుమూర్తి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె భర్తతో గొడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు కింద మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!
పోలీసులు మాధవి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా గురుమూర్తి ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో గురుమూర్తి కదలికలపై అనుమానం వచ్చి ఓ కన్నేసి ఉంచారు. కాగా 15న మాధవితో పాటు ఇంట్లోకి వెళ్లిన గురుమూర్తి మరునాడు బకెట్‌తో బయటకు రావడం మాత్రమే సీసీ కెమెరాల్లో రికార్డు కావడం పోలీసులు గుర్తించారు. దీంతో మరింత అనుమానం బలపడింది. అనుమానంతో స్టేషన్‌కు పిలిపించినప్పటికీ గురుమూర్తి సరైన సమాచాం ఇవ్వలేదు. అయితే మాధవీ కుటంబసభ్యులనుంచి ఒత్తిడి రావడంతో తట్టుకోలేక తానే మాధవిని చంపినట్లు ఆమె తండ్రి వెంకటరమణకు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురుమూర్తి ఇచ్చిన క్లూస్ ఆధారంగా పోలీసులు.. మీర్ పేటలోని చెరువులో పెద్ద గజ ఈతగాళ్లతో వారం రోజుల పాటు వెతికించారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ లభ్యమైంది.
ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?
కాగా మాధవి మాంసాన్ని ఉడికించిన సమయంలో కమురు వాసన వచ్చినట్లు చుట్టుపక్కల వారు కూడా సమాచారం ఇచ్చారు. మాధవిని హత్యచేయడానికి ఉపయోగించిన కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలతోపాటు పెయింట్ బకెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో