ఆమె అఘోరీ కాదు.. ఎవరో తెలుసా? నెట్టింట ఫోటోలు వైరల్..! తాజాగా లేడీ అఘోరికి సంబంధించి సోషల్‌మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒకప్పుడు అఘోరాగా ఉండి.. ఇప్పుడు అఘోరిగా మారినట్లు ఫోటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో అఘోరికి సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదైనానా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Seetha Ram 01 Nov 2024 in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి గత కొద్ది రోజుల నుంచి లేడీ అఘోరీకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అక్టోబర్ 31న సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అఘోరీ సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలో తమ తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో నిర్భందించారు. ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! అఘోరీ కాదు అఘోరా తాజాగా ఈ లేడీ అఘోరికి సంబంధించి సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నెటిజన్లు సోషల్‌మీడియాలో ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు అఘోరాగా ఉండి.. ఇప్పుడు అఘోరిగా మారినట్లు ఒక ఫోటో షేర్ చేసి ప్రచారం చేస్తున్నారు. గతంలో గడ్డం, మెడ నిండా రుద్రాక్ష మాలలతో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో అఘోరికి సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదైనానా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే కాగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు ఆలయాలు సందర్శించిన అఘోరీ ముత్యాలమ్మ ఆలయంలో నగ్నంగా పూజలు చేస్తూ వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి అఘోరీ పేరు మారుమోగిపోయింది. అయితే కొంతమంది ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేథరినాథ్ వెళ్లిపోయిన అఘోరీ ఆ తర్వాత మళ్లీ అక్టోబర్ 29న తెలంగాణకు వస్తానని ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! ఇక అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు వచ్చింది. సనాతన ధర్మంపై పోరాటం చేస్తానని.. అందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో తాను చనిపోతే శివుని దగ్గరకు వెళ్లిపోతానని.. చావకపోతే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొంది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో అక్టోబర్ 31న ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నోజు రోజుకు అఘోరీ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్న వస్తున్నారు. దీని కారణంగా పోలసులు భారీగా భద్రత కట్టుదిట్టం చేశారు. అఘోరీతో ఎవరినీ కలవనివ్వడం లేదు. అఘోరీ ఇంటికి 100 మీట్లర్ల దూరంలోనే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఇక ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది. #lady aghori మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి