KTR: ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ కేసు ఇంకొకటి ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు సంవత్సరాలు హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించానని, కానీ ఇలాంటి తుఫేల్ కేసు ఇప్పటివరకూ చూడలేదన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రజలు మీకిచ్చిన విలువైన సమయాన్ని నీళ్ల పాలు చేశారంటూ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు.
నేను రెండు సంవత్సరాలు హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ గా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించాను.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 19, 2024
అదే అనుభవంతో ఇప్పుడే @KTRBRS మీద సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబి నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు…
ఒక్కపైసా కేటీఆర్ జేబులోకి వెళ్లలేదు..
నాకున్న అనుభవంతో కేటీఆర్ మీద సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు. గమ్మత్తేందంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా సదరు రూ. 55 కోట్ల రూపాయల నుంచి ‘ఒక్క పైసా’ కూడా ‘కేటీఆర్ జేబుల్లోకి’ వెళ్లినట్టు నిరూపించలేక పోయారు.
స్పష్టత లేకుండానే ఆరోపణలు..
ఆ మాటకొస్తే అరవింద్ కుమార్ ఐయేఎస్, ఛీఫ్ ఇంజనీరు బీఎల్ఎన్ రెడ్డిల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేక పోయారు. మీరు చూపించగలిగిందంతా ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే. వీటికి శాఖా పరమైన ఎంక్వైరీ వేసి నిజమేందో తెలుసుకుంటే సరిపోయేది. అది ఇప్పటికే జరిగింది. సచివాలయంలో ఇలాంటి ప్రోసీజర్ వయోలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో రోజూ జరుగుతుంటయని అన్నారు. ఇక అట్ల చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదని, ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఇలాంటి వయోలేషన్స్ తరువాత కేబినెట్ లో పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతీది వయోలేషన్ లాగానే కనిపిస్తదని విమర్శించారు.
ఇది కూడా చదవండి: ఉద్యమకారులను అణగదొక్కి రాజకీయనేతలే ప్రయోజనం పొందారు.. సీఎం రేవంత్!
ఇందులో ఖర్చు పెట్టిన రూ. 55 కోట్లు రాష్ట్రంకు వందల కోట్ల రాబడి కోసమే పెట్టినమన్నారు. మీకేమైనా అనుమానాలు ఉంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా అని కేటీఆర్ చెబుతున్నా.. మొఖం చాటేసి పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనేనని అన్నారు. ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దుచేశారు? మీరు ముందు నిపుణుల కమిటీతో దీనిగురించి చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా? మీ వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయింది. అసలు ఈ ఫార్ములా -ఈ కేసు లో రేవంత్ రెడ్డి A-1 . కేటీఆర్ కాదు. ముమ్మాటికీ కాదు. ఇదే నిప్పు లాంటి నిజం. దాచేస్తే దాగని సత్యం అన్నారు.