తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఆ 9 మందికి రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన 9మంది ప్రముఖ కళాకారులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారి సేవలను తెలంగాణ ప్రజానికం ఎప్పటికి గుర్తుంచుకోవాలన్నారు. 

author-image
By srinivas
New Update
rererew

TG News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రముఖ రచయితలు, గాయకులు  గూడ అంజయ్య, గద్దర్,  అందెశ్రీ, వంటి ప్రముఖులకు ఆర్థిక సాయంతోపాటు ఇంటి స్థలాలను కేటాయించబోతున్నట్లు తెలిపింది. 

ళాకారులను వారు పట్టించుకోలేదు..

ఈ మేరకు సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన కళాకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమం కోసం సర్వం త్యాగం చేసిన కొందరు ప్రముఖులను, కవులు, రచయితల్ని సన్మానించడంతో పాటు వారికి ఆర్థికంగా చేయూత అందించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం సమయంలో అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఓరి రాజిగా అనే పాటు యువతను, విద్యార్థులను ఉద్యమం వైపు నడిపాయి. ఆయనను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గద్దర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదన్నారు. ఈ సందర్భంగా దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్ తేజ, గోడిశాల జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు కుటుంబాలకు రూ.1 కోటి నగదుతోపాటు ఇంటి స్థలాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

Also Read:  తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం..స్కూళ్లలో ఆ ఫొటోలు తప్పనిసరి

ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం..

బండెనక బండి కట్టి పాట రాసి బండి యాదగిరిగా ఫేమస్ అయిన ఆ రచయిత సేవలను మనం గుర్తుంచుకోవాలన్నారు. ఆయన కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. తెలంగాణ గేయం రచించిన అందెశ్రీతో పాటు గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్ తేజ, గోడిశాల జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు లాంటి 9 మంది కవులు, రచయితలు, కళాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.1 కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.  

Also Read:  'పుష్ప2' కు బలైన మరో ప్రాణం.. థియేటర్ లో అనుమానాస్పద మృతి

ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే.. చిన్ననాడు తన తల్లిని చూస్తే కలిగిన అనుభూతి కలిగిందన్నారు. కొన్ని పార్టీలు చేసే రాజకీయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎంతో మంది తనకు చెప్పారన్నారు. తొలి ఏడాదిలోనే ఎన్నో హామీలను నెరవేర్చి, ప్రజల విశ్వాసాన్ని మరోసారి చూరగొన్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారులు, అమరవీరులు తమ గుండెలపై టీజీ ని పచ్చబొట్టుగా వేసుకున్నారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక వారి ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం టీఎస్ గా మార్చిందని విమర్శలు గుప్పించారు. 

Also Read: ఉర్ఫీ ఫ్యాషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫొటోల పై సమంత కామెంట్!

Also Read: ఏపీ కూటమిలో యనమల చిచ్చు.. చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తూ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు