/rtv/media/media_files/2026/02/23/fotojet-47-2026-02-23-20-31-00.jpg)
Mullapudi Venkataratnam
ఉషాముళ్లపూడి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్డర్ ముళ్లపూడి వెంకటరత్నం (89) కన్నుమూశారు. గత మూడు నెలలుగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలో అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని వారు తెలిపారు. ముళ్లపూడి వెంకటర్నతం సీటీ సర్జన్‌గా విశేష సేవలు అందించారు. ఉషా ముళ్లమూడి పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తూ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. ఆయన మరణంతో ఒక మంచి సర్జన్‌ను నగరం కోల్పోయిందని నగర వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us