Gram panchayat election : గ్రామ పంచాయతీ ఎన్నిలకలకు సై.....ఎప్పుడంటే...

తెలంగాణలో గ్రామ పంచాయతీ పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ హామీ నేపథ్యంలో ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
Gram panchayat elections

Gram panchayat elections

Gram panchayat election  : తెలంగాణలో గ్రామ పంచాయతీ పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్న ఎన్నికల హామీ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఒక వైపు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రస్తుత సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి లబ్ధిపొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం చివరి లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలకు వెళ్లడానికి సై అంటోంది. 

ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుకున్నట్లే సమగ్రకుటంబసర్వేను పూర్తి చేసింది. పూర్తయిన సర్వే నివేదిక ఈ నెల2న సబ్‌కమిటీ చేతికి రానుంది. వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నివేదికకు అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తుదినివేదికను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపి వేచి చూసే దోరణిని అవలంభించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే పార్టీ ప్రకటించిన విధంగా పార్టీ పరంగా 42 శాతం బీసీలకు సీట్లు కేటాయించడం ద్వారా తననుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్లడానికి ప్రధాన కారణం. కొత్తగా ప్రవేశ పెట్టిన పథకాలే. జనవరి 26న రాష్ర్ట ప్రభుత్వం మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్న ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళ్తే విజయవకాశాలు సానుకూలంగా ఉంటాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి నివేదిక పంపిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచనప్రాయంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు.. అతిథుల లిస్ట్ ఇదే!

 ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిస్తూ గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. గత ఏడాది 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్‌లలో, మునిసిపాలిటీల్లో విలీనం చేశారు. మరోవైపు కరీంనగర్‌ పురపాలక సంఘాన్ని విస్తరిస్తూ మంచిర్యాల, కొత్తపల్లి, నస్పూరు స్థానిక సంస్థలను విలీనం చేశారు.ఇందులో కొన్నింటిని కొత్త మునిసిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటరు లిస్టులను తొలగించనున్నారు.  ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ గురువారం ఆదేశాలు జారీచేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు.ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న ముసాయిదా ఓటరు జాబితా, 4న ఎంపీడీవో స్థాయిలో ప్రజాప్రతినిధుల సమావేశం, 5న అభ్యంతరాలస్వీకరణ,  6న అభ్యంతరాల పరిష్కరణ, 7న తుదిజాబితా ప్రకటించాలని నిర్ణయించారు.

Also Read: AP Metro Rail Update: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లపై గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేవిధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఆయా మండలాలను విభజించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. కాగా ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించడంతో పంచాయతీ విభాగాలు, మండల అభివృద్ధి అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాల వివరాలను సిద్ధంచేశారు. శుక్రవారం వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని, 3న తుది ఎంపీటీసీ పరిధి జాబితాను ప్రకటించాలని పీఆర్‌ కార్యదర్శి ఆదేశించారు. ఇది పూర్తి అయితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో నోటిఫికేషన్‌, చివరిలేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్షాలకు షాక్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు