Ponnam Prabhakar : బండి సంజయ్ తప్పు చేశాడు.. మంత్రి పొన్నం సంచలన కామెంట్స్!

 కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సంజయ్ తన కొడుకుపైన ఆరోపణలు రాగానే వెంటనే సంజయ్ విచారణ చేయమని కోరాల్సిందని పొన్నం చెప్పుకొచ్చారు. కుట్ర చేస్తున్నారని సంజయ్  అనడం కంటే ఆ అమ్మాయి బండి భగీరథ్ ను కలిసిన మాట వాస్తవమా కాదా అనేది నిరూపించాలని చెప్పారు.

New Update
ponnam prabhakar

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన  సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో భగీరథ్‌పై 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. భగీరథ్ తనను లోబర్చుకుని, మద్యం తాగించి, నగర శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై పోలీసులు పోక్సో చట్టం (సెక్షన్లు 11, 12) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని డీజీపీ సి.వి. ఆనంద్‌ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్  చేశారు. బండి సంజయ్ తప్పు చేశాడన్నారు.

కుట్ర చేస్తున్నారని అనడం తప్పు

 కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సంజయ్ తన కొడుకుపైన ఆరోపణలు రాగానే వెంటనే సంజయ్ విచారణ చేయమని కోరాల్సిందని పొన్నం చెప్పుకొచ్చారు. కుట్ర చేస్తున్నారని సంజయ్  అనడం కంటే ఆ అమ్మాయి బండి భగీరథ్ ను కలిసిన మాట వాస్తవమా కాదా అనేది నిరూపించాలని చెప్పారు. కొంతమంది మున్నూరు కాపు నాయకులు ఎదో కుట్ర చేస్తున్నారు అంటున్నారు కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయేనని పొన్నం తెలిపారు. వేరే పార్టీ నాయకుడని సంజయ్  పట్ల వివక్ష ఉండదని,  అదే విధంగా కేంద్ర మంత్రి అని విచారణ పక్క దారి పట్టే అవకాశం లేదని పొన్నం తేల్చి చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు