సికింద్రాబాద్‌లో హైటెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానికులు శనివారం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనాకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. By B Aravind 19 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి సికింద్రాబాద్‌లో ఇటీవల ఓ దుండగుడు ముత్యాలమ్మ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంఘాల కార్యకర్తలు సికింద్రాబాద్‌లో చేపట్టిన ర్యాలీలో ఘర్షణ నెలకొంది. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి స్థానికులు శనివారం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనాకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపైకి నిరసనకారులు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లను విసిరారు. దీంతో పోలీసులు వాళ్లపై లాఠీఛార్జ్‌కు దిగారు. Police lathicharge non-violent and peaceful protests by Hindus against the CONgress Govt’s inaction against recent vandalism in Muthyalamma temple in #Secunderabad. Rather than addressing the increasing number of attacks on Hindu temples in broad daylight and punishing the… pic.twitter.com/07qdPG0NdS — Sumiran Komarraju (@SumiranKV) October 19, 2024 Also Read: ఓఎల్ఎక్స్లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు! ఇంటర్నెట్ బంద్ సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మత ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందగా సికింద్రాబాద్ బంద్‌ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ర్యాలీ జరగడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేదుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. పోలీసుల అదుపులో నిందితుడు సికింద్రాబాద్‌లో ఉన్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని కొన్ని రోజుల క్రితం ఓ ఆగంతకుడు ధ్వంసం చేశాడు. ఆ ఆలయం గద్దె పైకి ఎక్కి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ మరి కింద పడగొట్టి ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. The CCTV footage of the temple which was vandalised.... It's happening in a country where Hindus are in majority, imagine the situation of Bangladesh.... https://t.co/Kp93E442un pic.twitter.com/qWSMuomo4O — Mr Sinha (@MrSinha_) October 14, 2024 Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం! #secunderabad #attack on temple in secunderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి