యువతిపై స్నేహితుల ఘాతుకం.. మద్యం తాగించి గ్యాంగ్ రేప్ వరంగల్‌లో దారుణ సంఘటన జరిగింది. ఫార్మసీ విద్యార్థినిపై ఓ యువకుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి మద్యం తాగించి అత్యాచారం చేశాడు. ఆ యువతి తన తల్లితో చెప్పి వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Seetha Ram 02 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. నమ్మిన వారే దారుణానికి పాల్పడుతున్నారు. స్నేహం, ప్రేమ ముసుగులో తమను నమ్మిన వారినే మోసం చేస్తున్నారు. అలాంటిదే తాజాగా జరిగింది. ఫార్మసీ విద్యార్థినిపై ఓ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. లాడ్జికి తీసుకెళ్లి బలవంతంగా బీర్లు తాగించి ఆపై ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఓ యువతి హన్మకొండలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఫార్మసీ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. అయితే భూపాలపల్లికి చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఉంది. దీంతో ఆ యువకుడు ఆమె హాస్టల్ వద్దకు వెళ్లి తనతో మాట్లాడాలని కారు ఎక్కమన్నాడు. అయితే అప్పటికే ఆ కారులో మరో ఇద్దరు ఉండటంతో ఆమె నిరాకరించింది. దీంతో అతడు బలవంతంగా ఆమెను కారులో ఎక్కించాడు. ఆపై వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఒక లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నారు. అక్కడే ఆ యువతికి బాగా మద్యం తాగించారు. ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ యువతికి పరిచయం ఉన్న వ్యక్తితో సహా మరో ఇద్దరు కూడా అత్యాచారం చేశారు. అయితే ఈ విషయంపై ఆ యువతి మొదటిగా ఎవరికీ చెప్పలేదు. కాలేజీలో ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లింది. ఇది కూడా చదవండి: దారుణం.. మైనర్‌ను ప్రెగ్నెంట్ చేసిన వృద్ధుడు జరిగిన సంఘటనను తమ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ యువతితో పాటు ఆమె తల్లి వరంగల్ పోలీసు కమిషనర్‌ను కలిశారు. ఆపై ఆ యువతి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో కమిషనర్ సూచనలు సలహాల మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. లాడ్జ్‌కి వెళ్లి అక్కడి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆపై ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి నిందుతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో ఒకరిది భూపాలపల్లిగా గుర్తించారు. ఇందులో భాగంగా బాధితురాలిని వైద్యసాయం నిమిత్తం భరోసా కేంద్రానికి పంపించారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి