కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టు కీలక నిర్ణయం! తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కొండ సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది కోర్టు. By Nikhil 23 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కొండ సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది కోర్టు. మరో వైపు సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విషయమై నాంపల్లి న్యాయస్థానం ముందు ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నారు. అయితే గత విచారణ సందర్భంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి కేటీఆర్ కొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో న్యాయమూర్తి కేసును నేటికి వాయిదా వేశారు. దీంతో నేడు కేటీఆర్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. NEWS IS BEING UPDATED... #konda-surekha #akkineni-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి