Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అర్థరాత్రి ఇద్దరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని పట్టుకోగా మరొకడు తప్పించుకున్నాడు. దీంతో స్థానికులు ఆలయం దగ్గర నిరసనలు చేస్తున్నారు.

New Update

సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నించి దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు శబ్ధం రావడంతో స్థానికులు ఒకరిని పట్టుకున్నారు. ఇంకో నిందితుడు పారిపోయాడు.

ఇది కూడా చూడండి: Bomb Threat: బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

గణేష్ గో బ్యాక్ అంటూ..

స్థానికులు, హిందూ సంఘాలు ఆలయం దగ్గరికి చేరుకుని ఆందోళన చేపట్టారు. శ్రీ గణేష్ గో బ్యాక్ అంటూ స్థానికులు ఆందోళన చేపట్టగా పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలిసిన తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంటనే ఆలయం వద్దకు చేరుకున్నారు. గుడి లోపలికి వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఉన్నతాధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Contaminated Water : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత

నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు పోలీసులు దృష్టి పెట్టడం లేదు.. ఈ ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తానని కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి ఘటనను మరవక ముందే మరో ఘటన జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

దుండగులు చోరీకి ప్రయత్నించలేదని, విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చి ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించకుండా ఉంటే కుదరదు. కఠినంగా వ్యవహరించి దుండగులను శిక్షించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇకపైన అయిన హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేవాలయాల వద్ద రాత్రి సమయంలో పోలీసులు పర్యవేక్షించాలని కిషన్ రెడ్డి కోరారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. మతవిద్వేషాలను ప్రేరిపించే వారిని తప్పకుండా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి:  యాంకర్‌ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే

\

Advertisment
Advertisment
తాజా కథనాలు