BIG BREAKING : తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కైవసం!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.  

New Update
torruru

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.  తొర్రూరులోని మొత్తం 16 వార్డులకు గానూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 9 వార్డుల్లో ఘన విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ రెండో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థులు 6 వార్డుల్లో విజయం సాధించగా, మిగిలిన ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడటంతో స్థానిక బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్నప్పటికి కాంగ్రెస్ కు ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇక్కడ చక్రం తిప్పారని చెప్పవచ్చు. 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఫలితాల్లో BRS తన హవాను చాటుకుంది. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 13 వార్డుల్లో  విజయం సాధించింది.7 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.  13 స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో అయిజ పట్టణంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు జిల్లాలోని గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పూర్తి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు