/rtv/media/media_files/2025/03/06/SRYK0R5NOSlUClfIzZWG.jpg)
modi tweet in telugu Photograph: (modi tweet in telugu)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని తెలిపించినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ తె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అంటూ బీజేపీ కార్యకర్తలను మోదీ మెచ్చుకున్నారు.
Also read : half day schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే తెలంగాణలో ఆఫ్ డే స్కూల్స్
ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి @BJP4Telangana ను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను.@MalkaKomaraiah @AnjiReddy_BJP
— Narendra Modi (@narendramodi) March 6, 2025
ఏపీలోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై మోడీ అభినందనలు తెలియజేశారు. ఇకపోతే తెలంగాణ రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతు అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. దీంతో తెలంగాణ బీజేపీలో జోష్ నెలకొంది.
Also read: live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?