Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా! TG: కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేష్ కాల్ కట్ చేశారు. By V.J Reddy 22 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLC Jeevan Reddy: తన ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆయనను పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 40ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తనకు మంచి బహుమతి లభించిందని మహేష్ తో అన్నారు. ఇంత జరిగాక తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ చెప్పి మహేష్ కుమార్ మాట్లాడుతుండగా కాల్ కట్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య! నేను పార్టీలో ఉండను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన , ఓ వైపు మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి. pic.twitter.com/530Uo2dOUD — Journalist Vijaya Reddy (@vijayanews) October 22, 2024 ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం! కాంగ్రెస్ రాజ్యంలో బీఆర్ఎస్ పెత్తనం... తెలంగాణలో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల పెత్తనం కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం లో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగిత్యాలలో పోలీసులు బీఆర్ఎస్ నేతల కనుసందుల్లో పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాగా ఇటీవల జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ను తనకు తెలియకుండానే కాంగ్రెస్ లో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు సంజయ్ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఆనాడే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించగా.. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో తన రాజీనామా ఆలోచన నుంచి వెనుతిరిగారు. కాగా ఆరోజు నుంచి అధిష్టానంతు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి.. తాజాగా తన ముఖ్య అనుచరుడు హత్యకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. మరో సారి రు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇది కూడా చదవండి : Bomb Threats: దేశంలోని CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు #congress #jeevan-reddy #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి