BRS: అధిష్టానం చేతుల్లోనే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై వేటువేయాలని డిమాండ్ చేశారు. గత 4నెలలుగా తాను ఎన్నో అవమానాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

New Update
TG Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా!

MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై వేటువేయాలని అన్నారు. కాంగ్రెస్ విధివిధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకం అని చెప్పారు. ఫిరాయింపులు మంచిది కాదని తాను అధిష్టాన పెద్దలకు చెప్పినట్లు  తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మారదని తేల్చి చెప్పారు. తన అనుభవం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలో ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్!

అవమానాలకు గురవుతున్న....

తెలంగాణలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఉందని అన్నారు. MIM ను మినహాయించిన కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను నాలుగు నెలలుగా అవమానాలకు గురవుతున్నట్లు తెలిపారు. తాను కూడా ఒక కాంగ్రెస్ నేత అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను చెప్పేది మొత్తం అధిష్టానానికి చెప్పానని.. తరువాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదని అన్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!

కన్నీళ్లు పెట్టుకున్న జీవన్...!

కాగా నిన్న తన ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆయనను పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 40ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తనకు మంచి బహుమతి లభించిందని మహేష్ తో అన్నారు. ఇంత జరిగాక తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ చెప్పి మహేష్ కుమార్ మాట్లాడుతుండగా కాల్ కట్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. 

ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!

ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  శోభాయాత్రలో రాజాసింగ్‌ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో  భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్‌ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.  

ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment