KTR: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!

TG: కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని  రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 

New Update
KTRRR

MLA KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని  రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ తీవ్రతను పెంచిందని.. నాడు కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్!

ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

సీఎం రేవంత్ పై ధ్వజమెత్తిన కేటీఆర్....

నిన్న కరీంనగర్ దీక్ష దీవాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ అడుకుతినేదని సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంతో అడ్డగోలుగా వాగుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజాపోరాటాన్ని, అమరవీరులను కించపర్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నేతలు అనేక సార్లు.. ఒక గుజరాతీ వచ్చి విడిపించాడని... ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడని అంటున్నారని అన్నారు. ఇలాంటి వాళ్లతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకుంటే తప్పు చేసినవాళ్లమవుతం అని  హెచ్చరించారు.

Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!

Also Read:  కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

Advertisment
Advertisment
తాజా కథనాలు