ఆనాడు కాళ్ళు పట్టుకున్నారు: KTR TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల కాళ్ళు పట్టుకున్నారన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వారిపైనే పోలీసులతో లాఠీ ఛార్జి చేయడం దారుణమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని సెటైర్లు వేశారు. By V.J Reddy 07 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR : కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో కోసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో జాప్యం చేయడంపై ఆయన విమర్శల దాడికి దిగారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుందని చురకలు అంటించారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుందని అన్నారు. Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్ దొంగలు, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునట్టు ఉంది నారాయాణపేట-కొడంగల్ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ! సగం మీ ప్రియ కాంట్రాక్టర్ మెఘా కిృష్ణా రెడ్డికి, మిగతా సగం మీ మంత్రిగారికీ పంపకాలు చేయడం మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి గారు! Such a blatant disregard and utter disrespect for public… pic.twitter.com/bxvnljP7Ry — KTR (@KTRBRS) November 7, 2024 Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! సామెతతో సెటైర్లు... మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నామని .. ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు.. రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుందని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుందని అన్నారు. Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే సుఖం వస్తే మొకం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుందని అన్నారు. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుందని సెటైర్లు చేశారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుందని విమర్శలు గుప్పించారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు… — KTR (@KTRBRS) November 7, 2024 Also Read : పెద్దన్నలెవలే వేరు..అమెరికా అధ్యక్షుడి రాయల్‌లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా.. #ktr #revanth-reddy #telangana-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి